Ram Pothineni's Andhra King Taluka OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Continues below advertisement

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. మూవీకి పి మహేష్ బాబు దర్శకత్వం వహించగా... కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు.

Continues below advertisement

వీరితో పాటే రావు రమేశ్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల, తులసి, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందించారు. 

Also Read : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్

స్టోరీ ఏంటంటే?

స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)ను అభిమానులంతా ఆంధ్రా కింగ్ అంటూ ఆరాధిస్తుంటారు. తన వందో సినిమాను తెరకెక్కించే పనిలో ఉంటాడు. అంతకు ముందు వరుసగా 9 ప్లాపులు రావడంతో దాని ప్రభావం కొత్త మూవీపై పడుతుంది. ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. ఈ మూవీ పూర్తి కావాలంటే ఇంకా రూ.3 కోట్లు అవసరం అవుతుంటాయి. ఎంతోమందిని సాయం అడిగినా ఫలితం దక్కదు. ఇల్లు, కార్లు అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో సూర్య అకౌంట్‌కు రూ.3 కోట్లు జమ అవుతాయి.

ఓ అభిమాని నుంచి ఈ డబ్బు వచ్చిందని తెలుసుకున్న సూర్య తానే స్వయంగా అతన్ని చూసేందుకు వెళ్తాడు. ఇందులో భాగంగానే గోదావరి జిల్లాలో కరెంట్ కూడా లేని మారుమూల గ్రామం గూడిపల్లె లంకకు చెందిన సాగర్ గురించి తెలుసుకుంటాడు. అతను సూర్యకు వీరాభిమాని. అలా మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే)ను లవ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి సాగర్‌ను అవమానిస్తాడు. దీంతో అతనితో సాగర్ ఓ ఛాలెంజ్ చేస్తాడు? అసలు సాగర్ చేసిన ఛాలెంజ్ ఏంటి? సూర్య కోసం అతను చేసిన త్యాగం ఏంటి? సాగర్, మహాలక్ష్మిల లవ్ సక్సెస్ అయ్యిందా? సాగర్‌కు రూ.3 కోట్లు ఎలా వచ్చాయ్? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.