Amazon Prime Video Samantha Citadel Season 2 Web Series Cancels: ప్రముఖ నటి సమంత, బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన 'సిటడెల్: హనీ బన్నీ' (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ గతేడాది నవంబర్‌లో 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ పార్ట్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షాకింగ్ న్యూస్

అయితే, ఈ సిరీస్ అభిమానులకు తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో' బ్యాడ్ న్యూస్ చెప్పింది. సీజన్ 2 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటడెల్'కు ఇండియన్ వెర్షన్‌గా ఈ సిరీస్ రూపొందింది. ఇండియన్, ఇటాలియన్ వెర్షన్లను కొనసాగింపులను రద్దు చేశారు. దీనికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. దీనిపై అమెజాన్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు.

'సిటడెల్: హనీ - బన్నీ, సిటడెల్: డయానా తదుపరి సీజన్లు నిలిపేసి.. వాటి కొనసాగింపు కథలను మాతృకలో విలీనం చేస్తున్నాం. ఈ సిరీస్ అన్నీ భాషల్లోనూ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇది ఓ ఎమోషనల్ జర్నీ. మాతృకను మరింత గొప్పగా తెరకెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం.' అని వెల్లడించారు. మరోవైపు, ప్రియాంక నటిస్తోన్న 'సిటడెల్ పార్ట్ 2' 2026లో రిలీజ్ కానున్నట్లు తెలిపారు.

Also Read: పదేళ్ల తర్వాత కమెడియన్‌గా 'సంతానం' రీఎంట్రీ - 'శింబు' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారుగా!

వ్యూస్ పరంగా రికార్డులు

యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇండియన్ వెర్షన్ సైతం మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగానూ ఎన్నో రికార్డులు కైవసం చేసుకుంది. నిజానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ 'ప్రియాంక చోప్రా' నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటడెల్'కు ఇది ఇండియన్ వెర్షన్‌గా రూపొందింది. ఒరిజినల్ వెర్షన్‌లో హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు.

ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. గతేడాది నవంబరులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ పార్ట్ 2ను సినిమాగా తీసుకురావాలని మేకర్స్ రావాలని ఆలోచిస్తున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ తెలిపారు.

సమంత 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎక్కువ కష్టపడింది 'సిటడెల్' కోసమే. ఓవైపు మయోసైటిస్‌తో బాధ పడుతూనే సిరీస్‌లో కష్టమైన యాక్షన్   సీన్స్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో 'రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్', 'మా ఇంటి బంగారం' వంటి సినిమాలు ఉన్నాయి. మరోవైపు నిర్మాతగానూ సామ్ బిజీగా మారారు. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి తాజాగా 'శుభం' అనే సినిమాను ప్రారంభించారు.