Akka Teaser : బోల్డ్ లుక్​లో 'అక్క'గా వస్తోన్న కీర్తి సురేశ్.. రాధిక ఆప్టేతో కలిసి నెట్​ఫ్లిక్స్​లో వచ్చేస్తోందిగా

Keerthy Suresh's Akka Teaser : హీరోయిన్ కీర్తి సురేశ్​ థ్రిల్లర్ సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దానికి సంబంధించిన టీజర్​ను నెట్​ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది.

Continues below advertisement

Akka Teaser Out : కీర్తి సురేశ్ (Keerthy Suresh), రాధిక ఆప్టే (Radhika Apte)ప్రధాన పాత్రల్లో నెట్​ఫ్లిక్స్ వేదికగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ సిరీస్ 'అక్క'Next On Netflix Indiaలో భాగంగా.. దీనికి సంబంధించిన టీజర్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్ ఈ క్రేజీ టీజర్​ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. కీర్తి సురేష్​ మునుపెన్నడూ చూడని లుక్​లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీరియస్​గా, బోల్డ్​ లుక్​లో వాక్ చేస్తూ.. అందరిని స్టన్ చేసింది. 

Continues below advertisement

నెట్​ఫ్లిక్స్ వేదికగా థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సిరీస్​ను యష్​ రాజ్ ఫిల్మ్ ఎంటర్​టైన్​మెంట్​ను నిర్మించింది. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో వస్తోన్న ఈ వెబ్​ సిరీస్​కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. పేర్నూరుకు చెందిన ఓ అమ్మాయి పతనంపై రివేంజ్ ఎలా తీర్చుకున్నారనే అనే అంశంతో దీనిని తెరకెక్కించారు. ఇదే విషయాన్ని చెప్తూ.. నెట్​ఫ్లిక్స్.. The matriarchy stands strong. A rebel plots their downfall ♟️🔥 A girl from Pernuru seeks revenge against the Akkas. Akka is coming soon, only on Netflix. అనే క్యాప్షన్​తో టీజర్​ను షేర్ చేసింది. 

ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. గన్స్, గోల్డ్, మర్డర్, రక్తపాతాన్ని చూపిస్తూ.. టీజర్​ని విడుదల చేసి.. సిరీస్​పై అంచనాలను పెంచేశారు. కీర్తి సురేశ్, రాధిక ఆప్టే ఇద్దరూ కూడా ఇంటెన్స్ లుక్స్​తో టీజర్​లో కనిపించారు. రాధిక ఆప్టే ఇప్పటివరకు ఎన్నో సినమాలు, సిరీస్​లలో బోల్డ్​ లుక్​లో కనిపించి మెప్పించింది. కీర్తి సురేశ్ కూడా తన లుక్స్, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పటివరకు ఎప్పుడూ బోల్డ్​ లుక్​లో కనిపించలేదు కీర్తి. ఇది కీర్తి అభిమానులకు కాస్త షాక్​నే ఇచ్చింది.

పెళ్లికి ముందు ట్రెడీషనల్​ లుక్​లో ఎక్కువగా కనిపించిన కీర్తి..  పెళ్లి తర్వాత మోడ్రన్ లుక్స్​లో బేబి సినిమా ప్రమోషన్స్ చేసింది. సినిమాకి తగ్గట్లు ఆ లుక్​ని ఎంచుకుంది అనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అయితే ఎవరూ ఊహించని విధంగా బోల్డ్ లుక్​లో కనిపించి నెట్​ఫ్లిక్స్​లో థ్రిల్లర్ సిరీస్​ చేస్తోంది ఈ బ్యూటీ. రాధిక, కీర్తి ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఈ రివేంజ్ డ్రామాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ సిరీస్​ను నెట్​ఫ్లిక్స్ వేదిక ప్రేక్షకులను అలరించనుంది.

Also Read : సందీప్ కిషన్ హీరోగా​ నెట్​ఫ్లిక్స్​ నుంచి మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్​​.. పిల్లలను ఈజీగా కనే ఊరిలో హీరో సెక్స్ ఎడ్యూకేషన్​ జాబ్ చేయాల్సి వస్తే

Continues below advertisement