Sarkaaru Noukari OTT: ఓటీటీలోకి వచ్చేసిన సింగర్ సునీత కొడుకు మూవీ - ‘సర్కారు నౌకరీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sarkaaru Noukari OTT: సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రమే ‘సర్కారు నౌకరీ’. థియేటర్లలో విడుదలయిన రెండు వారాలలోనే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యింది.

Continues below advertisement

Sarkaaru Noukari OTT: 2024 న్యూ ఇయర్ సందర్భంగా పెద్దగా తెలుగు సినిమాలు ఏమీ థియేటర్లలో విడుదల కాలేదు. విడుదలయిన సినిమాలకు కూడా పెద్దగా బజ్ లేదు. ఈ ఏడాది జనవరి 1న విడుదలయిన సినిమాల్లో ‘సర్కారు నౌకరీ’ కూడా ఒకటి. టాలీవుడ్‌లో ఫేమస్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న సునీత కుమారుడు ఆకాశ్.. ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అందరూ కొత్త నటీనటులతో ప్రేక్షకులకు మెసేజ్ అందించే విధంగా ‘సర్కారు నౌకరీ’ తెరకెక్కింది. థియేటర్లలో తగినంత ఆదరణ సాధించకపోవడంతో రెండు వారాలు అవ్వకముందే ఓటీటీలోకి వచ్చేసింది ‘సర్కారు నౌకరీ’.

Continues below advertisement

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్..
న్యూ ఇయర్ సందర్భంగా సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం అయిన సినిమా ‘సర్కారు నౌకరి’ థియేటర్లలో విడుదలయ్యింది. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో వహించిన ఈ మూవీతో భావన వళపండల్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. హీరోహీరోయిన్లు కొత్తవారే అయినా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. ‘సర్కారు నౌకరి’లోని కంటెంట్ నచ్చి దీనిని నిర్మించడానికి ముందుకొచ్చారు. సునీతతో పాటు ఆకాశ్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది ఈ చిత్రం. మూవీ చూసినవారంతా బాగుంది అని రివ్యూలు ఇచ్చారు కానీ ఎక్కువగా ప్రేక్షకులు.. ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు వెళ్లలేదు. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

కష్టపడని సునీత..
జనవరి 12 నుండే ‘సర్కారు నౌకరీ’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. కానీ ఓటీటీ రిలీజ్ గురించి మేకర్స్ పెద్దగా హడావిడి చేయలేదు. సైలెంట్‌గానే స్ట్రీమింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా.. ఓటీటీలో అయినా ఆదరణ పొందుతుందని వారు భావిస్తున్నారు. కొత్తవారే అయినా కూడా హీరోహీరోయిన్‌గా ఆకాశ్, భావన యాక్టింగ్‌కు మంచి రివ్యూలు లభించాయి. సునీత కూడా తన కొడుకు హీరో అవ్వడంపై ఎన్నోసార్లు భావోద్వేగం వ్యక్తం చేసింది. ‘సర్కారు నౌకరీ’కి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రతీ ప్రమోషన్ కార్యక్రమానికి మూవీ టీమ్‌తో పాటు తను కూడా వెళ్లింది. ఇప్పటికే కూతురిని సింగర్‌గా లాంచ్ చేసిన సునీత.. ‘సర్కారు నౌకరీ’తో కొడుకును హీరోగా లాంచ్ చేసి తన బాధ్యతను పూర్తిచేసుకుంది.

ఇదే ‘సర్కారు నౌకరీ’ కథ..
ఇక ‘సర్కారు నౌకరీ’ కథ విషయానికొస్తే.. మహబూబ్‌నగర్‌కు చెందిన గోపాల్ (ఆకాశ్ గోపరాజు)కు తల్లిదండ్రులు లేరు. అందుకే చిన్నప్పటి నుండి కష్టపడి చదివి ఫైనల్‌గా సర్కారు నౌకరీ సంపాదిస్తాడు. అదే క్రమంలో తన సొంతూరిలోనే హెల్త్ ప్రమోటర్‌గా ఉద్యోగం వస్తుంది. హెల్త్ ప్రమోటర్‌గా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, అన్ని ఊళ్లకు తిరిగి కండోమ్స్ అమ్మడం తన పని. అదే సమయంలో హీరోయిన్ సత్య (భావన)తో ప్రేమలో పడతాడు. అందరినీ ఒప్పించి తనను పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ గోపాల్ చేసే ఉద్యోగం ఏంటి అని సత్యకు పూర్తిగా తెలియదు. తెలిసిన తర్వాత వారి జీవితాలు ఎలా మలుపులు తిరుగుతాయి అనేదే కథ. పీరియాడిక్ డ్రామా కాబట్టి ఎయిడ్స్ అనేది చాలా సెన్సిటివ్ విషయంగా తీసుకున్నారు మేకర్స్. 

Also Read: ‘నెట్‌ఫ్లిక్స్’లో నుంచి ‘అన్నపూర్ణి’ ఔట్ - కానీ, ఓటీటీలో మాత్రం ఇంకా స్ట్రీమింగ్, ఓ ట్విస్ట్ ఉంది

Continues below advertisement
Sponsored Links by Taboola