AHA OTT New Releases : ఈ రోజుల్లో ఓటీటీల హ‌వా న‌డుస్తుంది. వెబ్ సిరీస్ లకి ఫ్యాన్స్ అయిపోతున్నారు పెరిగిపోతున్నారు. సీజ‌న్లు సీజ‌న్లు ఓటీటీల్లో చూసేస్తున్నారు. ఇక సినిమాల విష‌యానికొస్తే.. ఒక‌సారి థియేట‌ర్‌లో చూసినా స‌రే.. ఓటీటీల్లో మ‌ళ్లీ చూస్తున్నారు. కొన్ని సినిమాలైతే.. సీదా ఓటీటీల్లోనే చూస్తున్నారు. భాష‌తో సంబంధం లేకుండా సూప‌ర్ హిట్ చేస్తున్నారు. ఇక దాన్నే క‌నిపెట్టింది ఆహా. ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా మంచి మంచి వెబ్ సిరీస్, సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇక ఇప్పుడు ఉగాది కానుక ఇచ్చింది ఓటీటీ ల‌వ‌ర్స్‌కు. ఎట్లిచ్చినం అంటూ క్యాప్ష‌న్‌తో త్వ‌ర‌లో రిలీజ్ అవ్వ‌బోతున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలను ప్ర‌క‌టించింది. 


'త్రీ రోజెస్ -  2'


ముగ్గురు స్నేహితుల క‌థ 'త్రీ రోజెస్'. దీనికి ఇప్పుడు కొన‌సాగింపు రాబోతోంది. 'త్రీ రోజెస్ సీజ‌న్ - 2' రాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఆహా. పాయ‌ల్ రాజ్ పుత్, ఈషారెబ్బ‌, పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. జాన్వీ, రీతూ, ఇందు పాత్ర‌ల్లో న‌టించారు ఆ ముగ్గురు. ఇక సీజ‌న్ - 2లో వీళ్లే న‌టించ‌నున్నారు. డైరెక్ట‌ర్ మారుతి క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సిరీస్‌కు ర‌వి నంబూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బోల్డ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ ఆహాలో సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఆ ముగ్గురు ప‌బ్‌లో కూర్చుని మందు తాగుతున్న ఫొటోను పోస్ట్ చేసింది ఆహా. ఇక ఈ ముగ్గురు హీరోయిన్ల‌తో పాటు మ‌రికొన్ని కొత్త పాత్ర‌లు కూడా సీజ‌న్ 2లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు.. 'హ‌రివిల్లు', 'డ్రైవ్', 'రాక్ష‌సి', 'ల‌వ్ డైరీస్' సినిమాల‌ను కూడా ప్ర‌క‌టించింది ఆహా ఓటీటీ. ఉగాది సంద‌ర్భంగా వీటిని అనౌన్స్ చేసింది. వీటికి సంబంధించిన వివ‌రాలు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 


'సిన్' సీజ‌న్ 2


'త్రీ రోజెస్'తో పాటు ఆహాలో హిట్ గా నిలిచిన మ‌రో సిరీస్ 'సిన్'. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతోంది. 'సీన్ - 2' రాబోతున్న‌ట్లు పోస్ట‌ర్ రిలీజ్ చేసింది ఆహా. తిరువీర్, దీప్తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇక వీళ్లు సెల్ఫీ ఫొటోకు ఫోజిస్తున్న పోస్ట‌ర్ ని పోస్ట్ చేసింది ఆహా. వారి ముఖాలు క‌నిపించ‌కుండా షేడ్ చేశారు ఆ ఫొటోని. ఇక త్వ‌ర‌లోనే 'సిన్ 2' వెబ్‌సిరీస్ ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్రకటించారు.






డిఫ‌రెంట్ జోన‌ర్స్.. 


'హ‌రివిల్లు' యువ జంట ప్రేమ క‌థగా తెలుస్తోంది. దీంట్లో హీరోహిరోయిన్లు ఎవ్వ‌రో ఇప్ప‌టికి ప్ర‌క‌టించ‌లేదు. రొమాంటిక్ కామెడీ జోన‌ర్‌లో దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. 'ల‌వ్ డైరీస్' కూడా ప్రేమ క‌థ‌గా క్యాప్ష‌న్స్ చూస్తే తెలుస్తుంది. 'రాక్ష‌సి హార‌ర్' కాగా.. 'డ్రైవ‌ర్' సినిమా యాక్ష‌న్ థ్రిల‌ర్ జోన‌ర్ లో రాబోతున్న‌ట్లు ఆహా చేసిన పోస్ట్ ల ద్వారా అర్థం అవుతోంది. 


ఇప్ప‌టికే స్ట్రీమ్ అవుతున్న తంత్ర‌.. 


అన‌న్య నాగెళ్ల ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హార‌ర్ సినిమా 'తంత్ర‌'.. ఇప్ప‌టికే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మ‌ల‌యాళం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమా 'ప్రేమ‌లు' ఈ నెల 12న ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ‘ప్రేమ‌లు’ బాక్సా ఫీస్ వ‌ద్ద భారీ హిట్ గా నిలిచింది. ఇక తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. దీంతో ఈ సినిమా కోసం ఓటీటీ ల‌వ‌ర్స్ వెయిట్ చేస్తున్నారు.


Also Read: మహేష్ బాబు మూవీలో అమీర్ ఖాన్? గట్టిగానే ప్లాన్ చేస్తున్నావుగా జక్కన్న!