తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది నటులు అవకాశాలు రాకో, అదృష్టం బాలేకో ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేక సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తమ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది అగ్ర హీరోల సినిమాల్లో కీలకపాత్రను పోషిస్తుంటే మరి కొంతమంది నటులు డైరెక్ట్ ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. అలా ఇప్పటికే జేడీ చక్రవర్తి, వేణు తొట్టెంపూడి లాంటి యాక్టర్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ చేసి మంచి రెస్పాన్స్ ని అందుకున్నారు.


ఇప్పుడు మరో హీరో కూడా అదే బాటలో వెళ్తున్నారు. అతను మరెవరో కాదు తెలుగులో ఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ. లాంగ్ గ్యాప్ తర్వాత శివాజీ ప్రజెంట్ బిగ్ బాస్ షోతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చాడు. 'బిగ్ బాస్' సీజన్ సెవెన్ లో నంబర్ వన్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు. తొలి రోజు నుంచి తన ఆటతీరు, తోటి కంటెస్టెంట్స్ తో వ్యవహరించే తీరుతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టారు. ఈ మేరకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అడుగు పెడుతూ 'నైన్ టీస్' (90's) అనే వెబ్ సిరీస్ తో రాబోతున్నారు.






దాదాపు ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత శివాజీ రీ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సిరీస్ లో శివాజీ చంద్రశేఖర్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాకుండా ఇందులో మ్యాథ్స్ టీచర్ గా అలరించబోతున్నట్లు పోస్టర్లో చూపించారు. వనపర్తి అనే ఊరి బ్యాక్ గ్రౌండ్ లో పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ కు ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ టైటిల్ కింద ఉన్న 'ఎ మిడిల్ క్లాస్ బయోపిక్(A Middile Class Biopic) అనే క్యాప్షన్ సిరీస్ పై ఆసక్తిని పెంచింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు.


త్వరలోనే ఈటీవీ విన్(Etv Win) ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శివాజీ ఆ తర్వాత హీరోగా మారాడు. 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'ప్రేమంటే ఇదేరా', 'యువరాజు', 'ప్రియమైన నీకు', 'ఖుషి', 'శివరామరాజు', 'ఇంద్ర' వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'మిస్సమ్మ' సినిమాతో హీరోగా మొదటి సక్సెస్ ని అందుకున్నాడు. హీరోగా మారిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. వాటిలో 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అమ్మాయి బాగుంది', 'మంత్ర', 'తాజ్ మహల్' వంటి సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. చివరగా 2016లో రిలీజ్ అయిన 'సీసా' మూవీ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. వరుస పరాజయాల కారణంగా శివాజీ సినీ కెరియర్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.


Also Read : సంక్రాంతి బరిలో ‘సైంధవ్’, ఈసారి విక్టరీ వెంకటేష్ లెక్క మారిపోయేనా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial