4.5 Gang Web Series OTT Release On Sonyliv: రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిన మలయాళీ ఒరిజినల్ సిరీస్ '4.5 గ్యాంగ్' త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. స్లమ్ ఏరియాలో పెరిగిన నలుగురు యువకులు తమ గౌరవం పెంచుకునేందుకు ఏం చేశారు? అనేదే బ్యాక్ డ్రాప్‌గా ఈ సిరీస్‌ను క్రిషాంద్ రూపొందించారు. 

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'4.5 గ్యాంగ్' సిరీస్‌ ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డార్క్ కామెడీ, రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. మలయాళం, తమిళం, హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. మ్యాన్ కైండ్ సినిమాస్ నిర్మించిన ఈ సిరీస్‌కు క్రిషాంద్ దర్శకత్వం వహించగా... జగదీష్, ఇంద్రన్స్, విజయ రాఘవన్, హకీం షా, దర్శన రాజేంద్రన్, సంజు శివరామ్, సచిన్, శాంతి బాలచంద్రన్, నిరంజ్ మణియన్ పిళ్లై, శ్రీనాథ్ బాబు, శంబు మీనన్, ప్రశాంత్ అలెక్స్, రాహుల్ రాజగోపాల్, విష్ణు అగస్త్య వంటి కీలకపాత్రలు పోషించారు. 

Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' వచ్చేశారు - ఫుల్ సెక్యూరిటీతో బాస్ ఎంట్రీ అదుర్స్

స్టోరీ ఏంటంటే?

స్లమ్ ఏరియా నుంచి వచ్చిన నలుగురు యువకులు తాము అనుకున్నది ఎలా సాధించారు అనేదే ఈ సిరీస్ స్టోరీ. ఓ ఊరిలో స్లమ్ ఏరియాలో ఉండే నలుగురు యువకులు గొప్ప పేరు సంపాదించుకోవాలని కలలు కంటారు. అందులో ఓ పిల్లాడు కూడా ఉంటాడు. ఆ ఊరి ఆలయం ఉత్సవం జరిపి తమ గౌరవాన్ని పెంచుకోవాలని ఈ గ్యాంగ్ అనుకుంటుంది. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? ఇదే ఉత్సవం జరిపి తమ గౌరవం పెంచుకోవాలనుకునే ప్రత్యర్థుల నుంచి వీరికి ఎదురైన సవాళ్లు ఏంటి? అక్కడ పువ్వులు, పాల వ్యాపారాలను నియంత్రించే స్థానిక గ్యాంగ్ స్టర్‌తో ఈ గ్యాంగ్‌కు వచ్చే ప్రమాదం ఏంటి? దీన్ని ఆ నలుగురు యువకుల గ్యాంగ్ ఎలా అధిగమించింది?అనేదే ఈ సిరీస్ స్టోరీ.