Chiranjeevi's Mega 157 Movie Title Glimpse Out: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే బిగ్గెస్ట్ స్పెషల్ వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'మెగా 157' నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ ఒరిజినల్ పేరునే టైటిల్‌గా ఖరారు చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేశారు అనిల్.
ఫుల్ సెక్యూరిటీతో బాస్ ఎంట్రీ
చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీకి 'మన శంకర వరప్రసాద్ గారు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో టైటిల్ అనౌన్స్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫుల్ సెక్యూరిటీ మధ్య మెగాస్టార్ ఎంట్రీ అదిరిపోయింది. చిరంజీవి స్టైలిష్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు.
విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో
మెగాస్టార్ స్టైల్‌గా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఎంట్రీ ఇవ్వడం వేరే లెవల్. మూవీలో ఆయన రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'మన శంకర వరప్రసాద్ గారు' పండక్కి వచ్చేస్తున్నారు' అంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో వెంకటేష్ ఓ కీలక రోల్ ప్లే చేయనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. 'సంక్రాంతికి రప్ఫాడించేద్దాం' అంటూ మొదటి నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి హైప్ ఇచ్చారు. టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే మొత్తానికి 'సంక్రాంతికి రప్ఫాడించేయడం' ఖాయంగానే కనిపిస్తోంది.
రోల్ అదేనా?
డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి 157 మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' చాలా స్పెషల్ అనేలా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆయన బర్త్ డే సందర్భంగా ఇప్పటివరకూ ఆయన చేసిన రోల్స్ అన్నింటినీ గ్లింప్స్‌లో చూపించారు. దీనికి మెగాస్టార్ హిట్ మూవీ 'గ్యాంగ్ లీడర్' బీజీఎం యాడ్ చేయడం మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మూవీలో ఆయన రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూవీలో ఆయన స్పై అధికారిగా కనిపించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కాదు ఓ డ్రిల్ మాస్టర్‌గా కనిపించనున్నారనే టాక్ కూడా వినిపించింది. తాజాగా టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే ఆయన ఓ పవర్ ఫుల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని అర్థమవుతోంది. ఫుల్ సెక్యూరిటీ మధ్య బాస్ ఎంట్రీ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మూవీలో చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండగా... వీరితో పాటే కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.