Rajeev Saluri's 11:11 Movie OTT Streaming : ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా నటించిన మూవీ '11:11'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి జగన్ డీకే దర్శకత్వం వహించారు. 2021లోనే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ మూవీని లాంచ్ చేసి మోషన్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.
డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్
2021లోనే లాంచ్ చేసిన ఈ మూవీ థియేటర్లలోకి రాలేదు. దీనికి ఆర్థిక సమస్యలే కారణమా? లేదా వేరే ఇతర కారణామేలైనా ఉన్నాయా? అనేది తెలీదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత నేరుగా సడన్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ మూవీలో రాజీవ్ సాలూరి సరసన వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, కోటి, సదన్ హాసన్, లావణ్య సుంకర తదితరులు కీలక పాత్రలు పోషించారు. గాజుల వీరేష్ నిర్మించారు.
Also Read : రాజాలా పెంచితే రోజా ముందు కూర్చున్నావ్ - నవ్వులు పూయిస్తోన్న 'నారీ నారీ నడుమ మురారి' టీజర్
స్టోరీ ఏంటంటే?
అర్జున్ ఓ ఫోరెన్సిక్ ఆఫీసర్. ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఓ రోజు ప్రైవేట్ విల్లాలో తన గర్ల్ ఫ్రెండ్‌తో గడుపుతుండగా ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో తీసి వీరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. 24 గంటల్లో రూ.4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అలా అర్జున్ ఓ అగాథంలో చిక్కుకుంటాడు. చివరకు దీని నుంచి బయటపడేందుకు అర్జున్ ఏం చేశాడు? అర్జున్‌ను బ్లాక్ మెయిల్ చేసింది ఎవరు? దీని నుంచి ఎలా ఈ కపుల్ బయటపడ్డారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.