ఒక సినిమా హిట్టా..? ఫట్టా..? అనేది కలెక్షన్స్ ను బట్టి నిర్ణయిస్తారు. నిర్మాతలు, డిస్త్రిబ్యూటర్లు ఇచ్చే నెంబర్లను బట్టే దాని అసలు ఫలితం డిసైడ్ అవుతుంది. కానీ ఆ ఛాన్స్ ఓటీటీలో ఉండదు. యూట్యూబ్ తరహాలో ఇన్ని వ్యూస్ వచ్చాయని చెప్పడానికి ఏ ఓటీటీ సంస్థ ఇష్టపడడు. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థల మధ్య కూడా పోటీ పెరగడంతో తమ పద్దతులను మార్చుకుంటున్నారు. తమ ఫ్లాట్ ఫామ్ లో సబ్స్క్రైబర్స్ ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటల సేపు కొత్త కంటెంట్ ని చూశారో ఒక్కొక్కరిగా బయటపెడుతున్నారు. 


అలానే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ లెక్కలు బయటకొచ్చాయి. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో జీ5 సంస్థ 'ఆర్ఆర్ఆర్'ను స్ట్రీమింగ్ చేసింది. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. దీంతో ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఎక్కువ మంది చూశారా..? అనే ఆసక్తి కలగడం సహజం. జీ5 చెప్పిన ప్రకారం 'ఆర్ఆర్ఆర్' సినిమాకి 190 దేశాల్లో వెయ్యి మిలియన్ నిమిషాల వ్యూస్ వచ్చాయని ప్రకటించింది. అంటే 16,666,667 గంటలు. 


ఇక నెట్ ఫ్లిక్స్ సంగతి చూస్తే.. మూడు వారాల వరకు 39,480,000 గంటల వ్యూస్ సాధించింది. అంటే జీ5 కంటే నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట. నెట్ ఫ్లిక్స్ కి గ్లోబర్ రీచ్ ఉండడంతో 'ఆర్ఆర్ఆర్'కి భారీ వ్యూస్ ను తీసుకొచ్చింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం 'ఆర్ఆర్ఆర్' ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇండియాలో మాత్రం 'ఆర్ఆర్ఆర్'ని నెంబర్ వన్ గా ఉంచింది జీ5 సంస్థ. 


Also Read: ఆరోజు 'పంజా' ఈరోజు 'మేజర్' - పవన్ మాటలకు అడివి శేష్ రిప్లై


Also Read: పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదు కానీ - సాయిపల్లవి కామెంట్స్