లెనోవో మనదేశంలో కొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. అదే లెనోవో ట్యాబ్ పీ12 ప్రో. ఈ ట్యాబ్లెట్ గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయింది. ఇందులో 12.6 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.


లెనోవో ట్యాబ్ పీ12 ప్రో ధర
దీని ధర రూ.69,999గా ఉంది. లెనోవో.కాం, అమెజాన్ వెబ్ సైట్లలో ఈ ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది త్వరలో ఆన్‌లైన్‌లో సేల్‌కి రానుంది. లెనోవో యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వన్ సొల్యూషన్ కూడా దీన్ని కొనుగోలు చేసి యాడ్ చేసుకోవచ్చు.


లెనోవో ట్యాబ్ పీ12 ప్రో స్పెసిఫికేషన్లు
ఈ ట్యాబ్లెట్‌లో 12.6 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2500 x 1600 పిక్సెల్స్‌గా ఉంది. హెచ్‌డీఆర్ 10+, యాంటీ ఫింగర్ ప్రింట్, డాల్బీ విజన్ వంటి డిస్‌ప్లే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ట్యాబ్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


ఫింగర్ ప్రింట్ సెన్సార్ ట్యాబ్ పక్కభాగంలో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 10200 ఎంఏహెచ్ కాగా... 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. కంటిన్యుయస్‌గా ఆన్‌లైన్ వీడియోలు చూసినా 14.6 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫోనర్ అందించనుంది. అంటే ఒక్కసారి చార్జ్ పెడితే ఐదు సినిమాలు నాన్‌స్టాప్‌గా చూడవచ్చన్న మాట. ఇది చాలా సన్నటి ట్యాబ్లెట్. దీని మందం 0.56 సెంటీమీటర్లు కాగా... బరువు 565 గ్రాములుగా ఉంది. 


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!