OTT Movies And Web Series Releasing This Week: ఈ వారం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. ‘నింద’, ‘హనీమూన్ ఎక్స్‌ ప్రెస్’, ‘ఓ మంచి ఘోస్ట్’, ‘సీతా కల్యాణ వైభోగమే’, ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ లాంటి సినిమాలు విడుదలకానున్నాయి. థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోయినా, ఓటీటీలో మాత్రం పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అలరించబోతున్నాయి. ఈ వారం ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘బాక్’, ‘నడికల్ తిలకం’. ‘మహరాజ్’ లాంటి చిత్రాలతో పాటు ‘అమెరికన్ స్వీట్ హార్ట్స్’ వెబ్ సిరీస్ లు కూడా విడుదల అవుతున్నాయి.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే


నెట్‌ఫ్లిక్స్


1. క్లెక్స్ అకాడమీ- పోలిష్ సినిమా- జూన్ 19న విడుదల


2. లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4-పోర్చుగీస్ సిరీస్- జూన్ 19న విడుదల


3. మహారాజ్- హిందీ సినిమా- జూన్ 19న విడుదల


4. అమెరికన్ స్వీట్ హార్ట్స్- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూన్ 20న విడుదల


5. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3- హిందీ వెబ్ సిరీస్- జూన్ 20న విడుదల


6. గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా- స్పానిష్ వెబ్ సిరీస్- జూన్ 21న విడుదల


7. నడికర్ తిలకం- తెలుగు డబ్బింగ్ మూవీ- జూన్ 21న విడుదల


8. ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2- వెబ్ సిరీస్- జూన్ 21న విడుదల


9. ట్రిగ్గర్ వార్నింగ్- ఇంగ్లీష్ మూవీ- జూన్ 21న విడుదల


డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్


1. బాక్- తెలుగు డబ్బింగ్ సినిమా- జూన్ 21న విడుదల


2. బ్యాడ్ కాప్- హిందీ వెబ్ సిరీస్- జూన్  21న విడుదల


3. ద బేర్ సీజన్ 3- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూన్ 21న విడుదల


జియో సినిమా


1. బిగ్ బాస్ ఓటీటీ- హిందీ రియాలిటీ షో- జూన్ 21న విడుదల


బుక్ మై షో


1. లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్- ఇటాలియన్ మూవీ- జూన్ 21న విడుదల


అమెజాన్ మినీ టీవీ


1. ఇండస్ట్రీ- హిందీ వెబ్ సిరీస్- జూన్ 19న విడుదల


Read Also: విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు - ఆ విషయంలో షారుఖ్, రణవీర్‌లను సైతం వెనక్కి నెట్టేసిన రన్ మెషిన్