సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశం పొందేందుకు ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటుంటారు. తొలి సినిమా మంచి సక్సెస్ అయితే, ఇక అవకాశాలకు తిరుగు ఉండదని భావిస్తారు. అందుకే తొలి సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించేందుకు ప్రయత్నిస్తారు. అయితే, కొంత మంది హీరోయిన్లు తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.
1. రిచా పల్లోడ్
‘నువ్వేకావాలి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. మంచి నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా మొదటి సినిమా అంత క్రేజ్ రాలేదు. ఆ తర్వాత రిచా మళ్లీ వెండితెరపై కనిపించలేదు.
2. అన్షు
‘మన్మథుడు’ సినిమాలో ముద్దుగా, బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మకు కూడా కాలం కలిసిరాలేదు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘రాఘవేంద్ర’ సిినిమాలో నటించినా ఛాన్సులు రాలేదు.
3. అనురాధ మెహతా
అల్లు అర్జున్ ‘ఆర్య’ సినిమాలో గీతగా అలరించిన అనురాధ ఆ తర్వాత తెరమరుగయ్యింది. ఆ తర్వాత ‘నువ్వంటే నాకిష్టం’, ‘వేడుక’ సినిమాల్లో నటించినా లక్ కలిసి రాలేదు.
4. నేహా
నితిన్‌తో కలిసి ‘దిల్’ సినిమాలో నటించింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతడే ఒక సైన్యం’లో హీరోయిన్‌గా నటించింది. ‘బొమ్మరిల్లు’, ‘దుబాయ్ శీను’ సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
5. రేణు దేశాయ్
‘బద్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘జానీ’లోనూ కనిపించి వెండి తెరకు దూరం అయ్యింది. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది.
6. భాను శ్రీ మెహ్రా
‘వరుడు’ సినిమాలో హీరోయిన్ గా చేసిన భాను, ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు. దీనికి కారణం అతి పబ్లిసిిటీ. హీరోయిన్‌ను పరిచయం చేయకుండా చేసిన ప్రయోగం ఆమెకు శాపమైందనే టాక్ ఉంది. సినిమాలో హీరోయిన్ ఎంట్రీ.. ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. పైగా ఆ సినిమా ఫ్లాప్ వల్ల ఆమెకు దారులన్నీ మూసుకుపోయాయి.
7. గౌరీ ముంజాల్
‘బన్నీ’ సినిమాలో హీరోయిన్ గా చేసిన గౌరీ.. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ 2006’, ‘గోపి-గోడ మీద పిల్లి’, ‘భూకైలాశ్’, ‘కౌశల్య సుప్రజ రామ’, ‘బంగారు బాబు’ మూవీల్లో నటించినా పెద్ద అవకాశాలేవీ రాలేదు.
8. మీరా చోప్రా
2006లో ‘బంగారం’ మూవీతో పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత రెండేళ్లకు ‘వాన’ సినిమాతో మెప్పించింది. ఆ తర్వాత ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ మూవీస్‌లో ఛాన్స్ వచ్చినా.. ముందు సినిమాలకు వచ్చినంత క్రేజ్ రాలేదు.
9. నేహా శర్మ
రామ్ చరణ్ తో కలిసి ‘చిరుత’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె వరుణ్ సందేశ్ కలిసి నటించిన ‘కుర్రాడు’ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
10. సియా గౌతమ్
‘నేనింతే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘వేదం’లో నటించింది. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ 2022లో విడుదలైన ‘పక్కా కమర్సియల్’ సినిమాలో నటించింది.
11. కార్తీక
సీనియర్ నటి రాధా కూతురిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక ‘జోష్’, ‘దమ్ము’ లాంటి పెద్ద సినిమాల్లో నటించినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
12. షామిలి
బేబీ షామిలిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘ఓయ్’ సినిమా చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ కూడా ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టలేదు.
13. పాయల్ ఘోష్
‘ప్రయాణం’ సినిమాలో కనిపించిన పాయల్, ఆ తర్వాత ‘ఊసరవిల్లి’ సినిమాలో చిన్న పాత్రతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
14. సారా జేన్ డయాస్
మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచిన ఈ ముద్దుగుమ్మ ‘పంజా’ సినిమాలో నటించి కనుమరుగైంది.
15.రితికా నాయక్
విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లాన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్ రెండో హీరోయిన్ గా నటించింది. తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.
Read Also: ‘ఏజెంట్’ నుంచి మరో సాంగ్ రిలీజ్, అందాల భామ ఒంపు సొంపులు, ఆకట్టుకుంటున్న యాక్షన్ సీన్లు