టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల్లో నటించిన ఈ హీరో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమాలో నటించారు. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో.. ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర ఈ సినిమాను నిర్మించారు.
''పెళ్లెప్పుడు చేసుకుంటావ్ రా అబ్బాయ్.. 30 ఏళ్లు పైబడ్డాయ్ పప్పన్నం పెట్టవా?.. పైన జుట్టు ఊడుపోతుంది.. కింద పొట్టపెరిగిపోతుంది.. ఇంకెప్పుడు పెళ్లి..? ఇలాంటి ప్రశ్నలు 30 ఏళ్లు దాటిన ప్రతి యువతీయువకులకు ఎదురవుతూనే ఉంటాయి. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పక్కింటోడు అడిగాడనా?.. లేదంటే వయసు అయిపోతుందనా?'' ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా.
తెలంగాణ లోని సూర్యాపేట లో వడ్డీ వ్యాపారం చేసే అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్)కి తన కులంలో సంబంధాలు దొరక్కపోవడంతో కులాంతర వివాహానికి రెడీ అవుతాడు. ఆంధ్రా అమ్మాయి మాధవి (రుక్సార్ ధిల్లాన్)తో పెళ్లి ఫిక్స్ చేసుకుంటారు. ఎంగేజ్‌మెంట్ కోసం బంధుమిత్రులతో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తాడు. అయితే సరిగ్గా అదే టైంకి లాక్ డౌన్ ప్రకటించడంతో పెళ్లి వాళ్ల ఇంట్లో లాక్ అయిపోతారు. సరిగ్గా పెళ్లి ముహూర్తం సమీపిస్తున్న టైంలో పెళ్లి కూతురు జంప్ అవుతుంది. మాధవి అర్జున్ కుమార్‌ని వదిలి ఎందుకు లేచిపోతుంది.. అసలు అర్జున్ పెళ్లి ఎవరితో జరుగుతుంది ? ఎప్పుడు అవుతుంది.. అని తెలుసుకోవాలంటే జూన్ 3 నుండి ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా చూడాల్సిందే.
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!