'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం దాదాపు మూడేళ్లు వెండితెరకు దూరమయ్యారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తమ తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు ఈ హీరోలు. ఇప్పటికే రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ సినిమాను మొదలుపెట్టేశారు. సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది.
ఈ సినిమా తరువాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అలానే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇటీవల ప్రశాంత్ నీల్.. రామ్ చరణ్, చిరంజీవిలను స్పెషల్ గా కలిశారు. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమా పక్కా అని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ అయితే వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నారు. ముందుగా కొరటాల శివ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా ఉంటుంది. అలానే బుచ్చిబాబు సానా, అట్లీ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. ప్రశాంత్ నీల్ తో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంది. అయితే వీటిలో ఏ సినిమా ముందుగా విడుదలవుతుందో చూడాలి!
Also Read: అమెజాన్ ప్రైమ్ లో 'రాధేశ్యామ్', స్ట్రీమింగ్ ఎప్పుడంటే?