యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన అభిమానులతో టచ్ లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటారు. ఫ్యాన్స్ కూడా తమకి ఏమైనా కష్టమొస్తే ఎన్టీఆర్ కి చెప్పుకుంటారు. ఆ విధంగా వారికి సాయం చేస్తుంటారు ఎన్టీఆర్. ఇటీవల ఎన్టీఆర్ అభిమాని జనార్దన్ ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం ఎన్టీఆర్ కి తెలియడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారాయన. సదరు అభిమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 


అభిమాని తల్లికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో, కాల్ రికార్డింగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు పీఆర్వోలు, అభిమానులు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను తెగ పొగిడేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ వీడియోలో కాల్ రికార్డింగ్ లో ఫోన్ నెంబర్ కనిపిస్తోంది. దీంతో అందరి దృష్టి ఆ నెంబర్ పై పడింది. ఆ నెంబర్ ఎన్టీఆర్ దే అనుకోని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 






అయితే అది ఎన్టీఆర్ నెంబర్ కాదని తెలుస్తోంది. ఆయన మేనేజర్ నెంబర్ అని సమాచారం. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో త్వరలోనే కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ చిన్న వీడియోను షేర్ చేయగా అది బాగా వైరల్ అయింది. 


Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర


Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి