NTR paid the fan Koushik hospital bill: ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ చికిత్స అందుకుని బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఆయన తల్లి సరస్వతి చేసిన విజ్ఞప్తికి ఎన్టీఆర్ స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాల మేరకు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ తన టీమ్ ను పంపించారు. చికిత్స పూర్తి అయిన తర్వాత మిగిలి ఉన్న 20 లక్షల బిల్లు కట్టి తన అభిమాని కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయించారు. దీనిపై కౌశిక్ తల్లి ఎన్టీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. మూడు నెలల పాటు చెన్నై లోనే కౌశిక్ కు పోస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని సరస్వతి తెలిపారు.
గత సెప్టెంబర్‌లో క్యాన్సర్ తో బాధపడుతూ చావు బతుకుల మధ్య వరకు వెళ్లిన తిరుపతి కి చెందిన శ్రీనివాసులు, సరస్వతి కుమారుడు కౌశిక్ తన చివరి కోరిక మేరకు దేవర సినిమా చూసి చనిపోవాలని కోరుకున్నాడు. తన అభిమాని విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో మాట్లాడారు. థైర్యంగా ట్రీట్మెంట్ తీసుకో నేను కలుస్తాను.. చికిత్స కు కావాల్సిన ఖర్చు గురించి మీరు భయపడకండి అని హామీ ఇచ్చారు.
Also Read: ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!
అభిమాన నటుడు ఇచ్చిన హామి మేరకు కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యవంతంగా ఉన్న ఆసుపత్రి నుంచి బయటకు రావడానికి 20 లక్లలు అవసరం. అభిమాని కోరిక మేరకు హామి తీర్చాలని లేదా దాతలు సహాయం చేయాలని కౌశిక్ తల్లి సరస్వతి సోమవారం ప్రెస్మీట్ పెట్టి తిరుపతిలో కోరారు.
కృష్ణా యాదవ్ అనే ఆయన మాకు జూనియర్ ఎన్టీఆర్‌తో వీడియో కాల్ చేయించారు. ఏదైనా హెల్ప్ చేయండి అని ఆయన్ని అడిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్లమని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అకౌంటెంట్ అని నా దగ్గర ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌కి కాల్ చేస్తే టీటీడీ ఇచ్చింది కదా మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. ఇంకేం చెప్పలేదు. ఎన్టీఆర్‌కు డైరెక్ట్ కాంటాక్ట్ నా దగ్గర ఏమీ లేదు. నేను ఆయన్ని హెల్ప్ చేయమని చాలా సార్లు అడిగినా లేదని చెప్పారు అని మీడియాతో చెప్పారు. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలియడంతో వెంటనే ఆస్పత్రి బిల్లు కట్టి డిశ్చార్జ్ చేయించారు. దీంతో ఆ తల్లి హ్యాపీగా ఉన్నారు.
Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్