యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేష‌న్‌లో లేటెస్టుగా ఓ సినిమా (NTR30) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హీరోగా ఎన్టీఆర్ 30వ చిత్రమిది. ఈ నెల 7న (సోమవారం, ఫిబ్రవరి 7) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ ప్రారంభోత్సవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అతిథిగా ఆహ్వానించారు. అంతా రెడీ. ఒక ప్రారంభోత్సవమే తరువాయి అనుకున్న సమయంలో వాయిదా పడింది. అవును... ఎన్టీఆర్ 30 ప్రారంభోత్సవం వాయిదా (NTR30 Launch Postponed) పడింది. కారణాలు ఏంటనేది ఇంకా తెలియలేదు. త్వరలో మరో ముహూర్తం చూసి సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేయాలని భావిస్తున్నారు.


ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్న సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt paired opposite NTR in NTR30) కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ కథను రెడీ చేసినట్టు తెలిసింది.


ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్‌ లీడ‌ర్‌గా కనిపించనున్నారు. ఇంపార్టెంట్ మేటర్ ఏంటంటే... బస్తీలో చదువుకునే పేద విద్యార్థుల హక్కుల కోసం, ఆ పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేసే నాయకుడిగా ఆయన కనిపించనున్నారని తెలిసింది. ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకుడు ఎలా ఢీ కొన్నాడు? అనేది కథ (NTR30 Story Line). రాజకీయాలు, రాజకీయ నాయకులతో ఓ విద్యార్థి చేసే పోరాటం మీద సినిమా ఉంటుందని సమాచారం.