నోరా ఫతేహి... 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి...' పాటలో ముగ్గురిలో ఒకరిగా నటించిన భామ. అదొక్కటే కాదు... 'టెంపర్'లో 'ఇట్టాగే రెచ్చిపోదాం', 'కిక్ 2'లో ఐటమ్ సాంగ్, 'ఊపిరి' సినిమాలో 'డోర్ నెంబర్...' సాంగ్స్ చేసింది ఆవిడే. హిందీ సినిమాల్లోనూ పలు ఐటమ్ సాంగ్స్ చేశారు. సినిమాల్లో మాత్రమే కాదు... సినిమాల్లో మాత్రమే కాదు... ఇన్‌స్టాగ్రామ్‌లోనూ నోరా ఫ‌తేహి చాలా పాపులర్. ఆమె  ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ చేసిందనేది శుక్రవారం మధ్యాహ్నం హెడ్ లైన్స్. కానీ, రాత్రికి సీన్ మారింది. అసలు, ఏం జరిగిందంటే?


ఇన్‌స్టాగ్రామ్‌లో నోరా ఫతేహికి 37 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఆమె ముంబై వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. అటువంటిది శుక్రవారం మధ్యాహ్నం స‌డ‌న్‌గా ఆమె ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ చేసిందనే వార్తలు వచ్చాయి. నోరా ఫతేహి ఇన్‌స్టా పేజీ కనిపించకుండా పోయింది. శుక్రవారం రాత్రి మళ్లీ రీస్టోర్ అయ్యింది. ఎవరో తన అకౌంట్ హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు.


"అందరికీ సారీ! నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఉదయం నుంచి ఎవరో నా ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేయాలని ప్రయత్నించారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించిన ఇన్‌స్టా టీమ్ కు థాంక్స్" అని నోరా ఫతేహి పోస్ట్ చేశారు. అదీ సంగతి! నోరా ఫతేహి పులి పిల్లలకు పాలు తాగిస్తున్న వీడియో పోస్ట్ చేశాక... ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయ్యింది. మళ్ళీ పాత ఫొటోలు, వీడియోలతో అకౌంట్ అందుబాటులోకి వచ్చింది.