మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఆ రోజున మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా మహేష్ సినిమా నుంచి అప్డేట్ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూశారు ఫ్యాన్స్. కానీ మహేష్ బాబు మాత్రం ఈసారికి సెంటిమెంట్ పక్కన పెట్టేశారు. తన తండ్రి పుట్టినరోజుకి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. త్వరలోనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు మహేష్ బాబు.
ఈ సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారనే విషయం మాత్రం చెప్పలేదు. దీంతో కనీసం ఆ విషయాన్నైనా వెల్లడిస్తారేమో అనుకున్నారు. కొన్ని రోజులుగా త్రివిక్రమ్ ఈ సినిమా పోస్టర్ పై వర్క్ చేస్తున్నారని మే 31న కచ్చితంగా రిలీజ్ చేస్తారని అన్నారు. కానీ అటు మహేష్ నుంచి కానీ ఇటు హారిక-హాసిని బ్యానర్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
కేవలం కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఊరుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నారు. త్రివిక్రమ్ సినిమా తరువాత మొదలయ్యేది ఈ సినిమానే. కానీ ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ ఇప్పట్లో అప్డేట్స్ ఆశించడం లేదు. కనీసం త్రివిక్రమ్ సినిమా నుంచి అప్డేట్ రాలేదని మాత్రం నిరాశ చెందారు.
ఈ ప్రాజెక్ట్ లు పక్కన పెడితే.. మహేష్ నుంచి మరో కొత్త సినిమా ప్రకటన వస్తుందనే ప్రచారం జరిగింది. 14 రీల్స్ బ్యానర్ పై ఆ ప్రకటన వస్తుందంటూ ఊహాగానాలు వినిపించాయి. ఆ అప్డేట్ కూడా రాలేదు. మొత్తానికి కృష్ణ పుట్టినరోజుకి మహేష్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.