VNRTrio : యంగ్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న 'VNRTrio' మ్యూజిక్ సిట్టింగ్స్  ప్రారంభమయ్యాయి. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 


ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా మూవీ టీం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్‌లను ప్రారంభించింది. ప్రముఖ గీత రచయిత శ్యామ్ కాసర్ల కూడా 'VNRTrio' కోసం గ్రూపులో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నట్టు తెలుస్తోంది.


'VNRTrio' సినిమాలో నితిన్ స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తుండగా, రష్మిక మందన్న ఈ చిత్రంలో అల్ట్రా-మోడిష్ లుక్‌లో కనిపించనుంది. నితిన్, రష్మిక పుట్టినరోజుల సందర్భంగా మేకర్స్ ఇటీవలే వేర్వేరు పోస్టర్లను విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కూడా నటించనున్నారు. 'VNRTrio' కి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. సినిమాకు సంబంధించిన తదుపరి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


‘భీష్మ’ చిత్రంలో నితిన్‌-రష్మిక మందన్న జోడీ చక్కటి కెమిస్ట్రీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ జంట మరోమారు వెండితెరపై సందడి చేయబోతుండడంతో ఫ్యాన్స్ మరోసారి ఈ ట్రీట్ ను ఆస్వాదించేందుకు రెడీగా ఉన్నారు. వీరిద్దరి కలయికలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తొన్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నటుడు చిరంజీవి క్లాప్‌నివ్వగా, దర్శకుడు బాబీ కెమెరా స్విఛాన్‌ చేశారు. వినోదంతో పాటు అడ్వెంచరస్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు నవ్యపంథాలో సాగుతాయని చిత్రబృందం ఇంతకుమునుపే పేర్కొంది.


దర్శకుడు వెంకీ కుడుముల ఇంతకుమునుపే 'ఛలో', 'భీష్మ' చిత్రాలతో తన టాలెంట్ ను నిరూపించుకున్న విషయం అందరికీ తెలిసిందే. సింపుల్ కథని తన రచన, కామెడీ సన్నివేశాలతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం వెంకీకి కొత్తేం కాదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో త్రివిక్రమ్ శైలి ఉందని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే వెంకీ కుడుముల త్రివిక్రమ్ శిష్యుడే కావడం మరో చెప్పుకోదగిన విషయం.


'భీష్మ' తర్వాత వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నించారు. అయితే కథలో కొన్ని అంశాలు నచ్చకపోవడంతో చిరు స్టోరీని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వెంకీ అదే కథతో ఈ చిత్రం చేస్తున్నారా, లేదా వేరే కథతో నితిన్, రష్మికలను చూపించబోతున్నాడా అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.


ఇక 'భీష్మ' సినిమా ద్వారా నితిన్, రష్మిక మందనలతో పని చేసిన వెంకీ కుడుముల.. మరోసారి ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తోన్న ఈ రెండో సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజుల క్రితమే ఓ అనౌన్స్ మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వెంకీ కుడుముల, నితిన్, రష్మికల మధ్య సాగే ఫన్నీ సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. 


Read Also : Mahesh Babu Goofy Pics : మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?