సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై పబ్లిక్ లో ఎప్పుడూ అటెన్షన్ ఉంటుంది. వారు కాస్త భిన్నంగా ఏం చేసినా అవి వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా నటీనటుల ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు వారి ఫాలోవర్స్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో ఇది ఇంకా ఎక్కువైపోయిందనే చెప్పాలి. దానికి తోడు కొంతమంది సెలబ్రెటీల ప్రవర్తన అప్పుడప్పుడూ వారి అభిమానులను గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. తర్వాత అవే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. తాజాగా మెగా డాటర్ నిహారికా కొణిదెల, ఆమె భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య వ్యవహార శైలి అలాగే కనిపిస్తోంది. పెళ్లయిన మొదట్లో నెట్టింట తెగ హల్చల్ చేసిన ఈ జంట గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఈ జంట గురించి మరో షాకింగ్ వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారికకు 2020లో చైతన్యతో వివాహం జరిగింది. రాజస్థాన్ లోని ఒబెరాయ్ విలాస్ లో వీరి పెళ్లిని పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ పెళ్లికి బంధువులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండేది. తమ లేటెస్ట్ ఫోటోలతో అందర్నీ ఆకట్టుకునేవారు. పలు టీవీ ప్రోగ్రాంలలో కూడా కనిపించారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట సైలెంట్ గా ఉంటోంది. తాజాాగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యామిలీలో అందర్నీ ఫాలో అవుతోన్న చైతన్య నిహారికను మాత్రం అన్ ఫాలో చేశాడు. అంతే కాదు వారి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశాడు. గతంలో వారిద్దరూ కలసి దిగిన ఫోటోలను సైతం డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారా అనే వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం చూసి మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైతన్య, నిహారికల మధ్య ఏం జరిగింది? ఎందుకు ఫొటోలు డీలీట్ చేశారు? అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే దీనిపై చైతన్య ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం నిహారికకు సంబంధించి ఒక్క ఫొటో మాత్రమే ఇన్‌స్టాలో ఉంది. అతనికి ఎంతో ఇష్టమైన గోల్డెన్ రిట్రైవర్ బజ్‌తో నిహారిక ఉన్న ఫొటోను మాత్రమే ఉంచాడు.
ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా నిహారిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే కొన్ని రోజుల తర్వాత చైతన్య ఇద్దరూ కలసి దిగిన ఓ ఫోటోను షేర్ చేయడంతో ఆ విడాకుల వార్తలకు చెక్ పడింది. అయితే తాజాగా ఇప్పుడు చైతన్యనే స్వయంగా నిహారిక ఫోటోలు డిలీట్ చేసి ఆమెను అన్ ఫాలో చేయడంతో ఏదో పెద్ద విషయమే జరిగిందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. వారిద్దరూ విడాకులు తీసకోబోతున్నారా, అందుకే కలసి బయట కనిపించడం లేదా అంటూ ఆరా తీస్తున్నారు. మరి దీనిపై చైతన్య, నిహారికా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే నిహారిక మాత్రం తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేయలేదు. తన భర్తతో విహారయాత్రలో ఉన్న ఫొటోలు కూడా ఇంకా ఆమె ఇన్‌స్టాలో ఉన్నాయి.
Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!