అనగనగా ఓ కుర్రాడు. అతడి పేరు మహేష్. ఇంటి చుట్టుపక్కల వాళ్లకు, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు... ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మహేష్ అంటే మనోడు అన్నట్టు పిలుస్తారు. అతడితో పాటు ఇంట్లో తల్లితండ్రులు, బామ్మ ఉంటారు. అక్కడితో ఆగితే కథ వేరేలా ఉండేది. కానీ, మహేష్ తండ్రి ఓ ఫిట్టింగ్ పెడతాడు. అదేంటి? 'పదిహేనేళ్ల... ఆల్మోస్ట్ వనవాసమే సెట్ చేసి పోయిండు కదా! ఇంతకీ అది గిఫ్ట్ కాదు, ఓ రాడ్డు' అని మహేష్ ఎందుకు బాధపడుతున్నాడు? తెలియాలంటే... 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' చూడాలి.


మహేష్ పాత్రలో సంగీత్ శోభన్ నటించిన వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. (#OCFS) అతడి తండ్రి పాత్రలో వీకే నరేష్, తల్లిగా తులసి నటించారు. సిమ్రన్ శెట్టి హీరోయిన్. 'గెటప్' శీను కీలక పాత్రలో నటించారు. నాగబాబు కుమార్తె, నటి నిహారికా కొణిదెల నిర్మించిన ఈ సిరీస్ కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' టీజర్ ను హీరో నాని విడుదల చేశారు. 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. నవంబర్ 8న ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 19న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.






టీజర్ చూస్తే... మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంలో సిరీస్ తెరకెక్కించారు. తెలంగాణ యాసలో సంగీత్ శోభన్ డైలాగులు చెప్పారు. గతంలో నిహారికా కొణిదెల 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచి', 'మ్యాడ్ హౌస్' వెబ్ సిరీస్ లు నిర్మించారు. ఆమె నిర్మించిన నాలుగో సిరీస్ ఇది. "కామెడీ డ్రామా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ ఇది. ఇందులో ఐదు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ నెల 19న 'జీ 5'లో సిరీస్ విడుదల కానుంది" అని 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' గురించి నిహారికా కొణిదెల చెప్పారు. నాగబాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ వీక్షకుల్ని ఆకట్టుకుందని, సిరీస్ కూడా ఆకట్టుకుంటుందని దర్శకుడు మహేష్ ఉప్పాల పేర్కొన్నారు. అన్నట్టు... సిరీస్‌లో హీరో పాత్ర‌కు త‌న పేరే పెట్టారు ఆయ‌న‌.


Also Read: చంద్రబాబుకు పగ్గాలు ఎందుకిచ్చావ్? - మోహన్ బాబు... ఎవరు ఆపుతారో చూద్దాం! - బాలకృష్ణ
Also Read: ఏడాదిన్న‌ర ఎదురుచూశా.... ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజ‌మౌళి
Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!
Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి