పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరెక్కుతున్న తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్నది. పవర్ స్టార్ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఎక్కడికో వెళ్తుందని అందరూ భావించారు. కానీ, ఈ సినిమా మొదలై మూడేళ్లు గడిచినా ఇంకా తుది దశకు చేరలేదు. నిర్మాణంలో జాప్యం జరిగినప్పటికీ నిధి ఓపికగా, ఆ సినిమా కోసం పని చేస్తున్నది. కొన్ని చిన్న సినిమాలకు అవకాశం వచ్చినా.. తను సైన్ చేయలేదు.


తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో సూపర్ డూపర్ ఛాన్స్ వచ్చింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మారుతి కలిసి చేస్తున్న సినిమాలో నిధి అగర్వాల్ కు అవకాశం దక్కింది. వెంటనే అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఒకరు నిధి అగర్వాల్ కాగా, మరొకరు మాళవిక మోహన్. మూడో నటిని సినిమా యూనిట్ త్వరలో ఖరారు చేయనున్నది.


Also Read: కల్యాణ్ రామ్ అభిమానులకు దీపావళి కానుక, 'బింబిసార' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!


మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభాస్ వెల్లడించాడు. ప్రభాస్ ప్రకటన తర్వాత ఈ సినిమా కథేంటి? షూటింగ్ ఎప్పటి నుంచి అనే చర్చ అభిమానుల్లో జోరుగా కొనసాగుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా..  రెగ్యులర్‌ షూటింగ్ కు  సిద్ధమవుతోంది. హార్రర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా,  వచ్చే వారంలో రెగ్యులర్‌ షూటింగ్ మొదలు కానుంది.  ఈ షెడ్యూల్‌ లో ప్రభాస్‌ లేని కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేయబోతున్నట్లు సమాచారం.  బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ ద‌త్ ఈ మూవీలో ఓ కీ రోల్ పోషించనున్నట్లు తెలుస్తున్నది. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా ప్రయోగాత్మకంగా రూపొందుతున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రభాస్ గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించనున్నాడట.  ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన ‘ఆది పురుష్‌’ విడుదలకు రెడీ కాగా,  ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.    


ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ తొ ‘హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు’ సినిమాలో నిధి నటిస్తున్నది. క్రిష్ దర్శకత్వంలో  ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.  ఇందులో మొఘ‌ల్ కాలానికి చెందిన ట‌చ్ ఎక్కువ‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు నిధి అగ‌ర్వాల్ కాగా, మ‌రొక‌రు బాలీవుడ్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ.  ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ప్ర‌భాస్ సినిమాలో నిధి  అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమా నిధికి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది. వరుసగా రెండు పెద్ద సినిమాల్లో చేస్తుండటంతో తన కెరీర్ ఓ రేంజిలో పుంజుకునే అవకాశం ఉంది.