VK Naresh: ఈ మధ్య సోషల్ మీడియాలో నటీనటులపై ట్రోల్స్ బాగా పెరిగిపోయాయి. వారు పెట్టే ఫొటోలు లేదా పోస్టుల్లో ఏదైనా తేడా ఉంటే చాలు.. ఉతికి ఆరేస్తున్నారు. కొందరైతే వార్తల్లో కూడా రాయలేని పదాలతో వారిని తిట్టిపోస్తున్నారు. అయితే, ఒకరిని అలా నిందించడం చాలా తప్పు. అలాగే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని తెలిసి కూడా కొందరు సెలబ్రిటీలు పోస్టులు పెడుతుంటారు. మరి, అవి కావాలని పెడతారా? లేదా వేరే ఆలోచన లేకుండా పెడతారా అనేది వారికే తెలియాలి. 


‘మా’ ఎన్నికలు, ‘సన్ ఆఫ్ ఇండియా’ విడుదల నేపథ్యంలో ఇటీవల మోహన్ బాబు కుటుంబాన్ని నెటిజనులు, ట్రోలర్స్ ఎంతగా ఇబ్బంది పెట్టారో తెలిసిందే. వారి ట్రోల్స్‌ను తట్టుకోలేక మంచు కుటుంబం రూ.10 కోట్లు దావా వేస్తామని కూడా హెచ్చరించారు. అయితే, ట్రోలర్స్ దాన్ని కూడా వదలకుండా మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికితే మంచు విష్ణును విమర్శించేందుకు సిద్ధమైపోతున్నారు. ఎందుకిలా ట్రోల్స్ చేస్తున్నారని విమర్శకులను ప్రశ్నిస్తే.. వారి సెల్ఫ్ డబ్బాను భరించలేకపోతున్నామని అంటున్నారు.


ఇక నరేష్ విషయానికి వస్తే.. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుకు అండగా, ఆయన ప్యానెల్ గెలిచేందుకు ఎంతో ప్రయత్నిచారు. చివరికి అనుకున్నది సాధించారు. అన్నట్లుగానే విష్ణును ‘మా’ అధ్యక్షుడిని చేశారు. దీంతో నెటిజనులు నరేష్‌ను కూడా టార్గెట్ చేసుకున్నారు. ‘మా’ ఎన్నికల సమయంలోనే కాకుండా, సాయి ధరమ్ తేజ్ బైకు ప్రమాద సమయంలో కూడా నరేష్ ఓ విషయంలో నోరు జారారనే కారణంతో ఆయన్ని ట్రోల్ చేశారు. తాజాగా నరేష్ తిరుపతి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఆయన ట్వీట్లో పేర్కొన్న విషయం నెటిజనులకు నచ్చలేదు. ‘‘నైక్ ఎయిర్ షూస్ కోసం గంట సేపటి నుంచి తిరుపతి చుట్టూ తిరుగుతున్నా. కానీ, ఎక్కడా దొరకలేదు. వాటి కోసం తిరిగి హైదరాబాద్ వెళ్లాలి. చాలా వింతగా ఉంది’’ అని పెట్టారు. దీంతో నెటిజనులు ‘‘ఈ గొప్పలే వద్దు’’ అంటూ హితవు పలుకుతున్నారు. ‘‘మరికొందరు ఆ షూలే కొనాలా మరో షో కొనుక్కో కూడదా? దాని కోసం హైదరాబాద్‌కు వెళ్లాలి’’ అని అంటున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి. 






















గమనిక: సోషల్ మీడియాలో నెటిజనుల చేసే ట్వీట్లను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ట్వీట్లలో పేర్కొన్న వ్యాఖ్యాలన్నీ వారి వ్యక్తిగతం. వారి కామెంట్స్‌తో ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్‌’కు ఎటువంటి సంబంధం లేదని గమనించగలరు.