Netizens Trolling On Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అమ్మడు అతిపై బోలెడు జోకులు వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఊర్వశి రౌతేలాపై నెటిజన్ల ట్రోలింగ్
తాజాగా ఊర్వశి రౌతేలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని మరీ కనిపించింది. నిజానికి హాస్పిటల్లో చికిత్సపొందుతున్న వీడియోను సోషల్ మీడియాలో పెడితే, నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. ఈమెను టార్గెట్ చేయడం ఏంటని అందరికీ ఆశ్చర్యం కలగకమానదు. కానీ, ఆమె హాస్పిటల్లో చేరింది పెద్ద ప్రాబ్లంతో కాదు. కేవలం, వేలికి చిన్న గాయం అయ్యింది. కాస్త రక్తం బయటకు వచ్చింది. అంతమాత్రం దానికే ఏకంగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం, అదో గొప్పకార్యం అనేట్లుగా ఆ వీడియోను షేర్ చేయడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
“వేలుకు చిన్నగాయంతో హాస్పిటల్లో చేరిన తొలి మహిళగా గుర్తింపు పొందింది” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “ఊర్వశీ.. ఊర్శశీ.. టేకిట్ ఈజీ ఊర్వశీ” అంటూ మరికొంత మంది కామెడీ చేస్తున్నారు. ‘ఓవర్ యాక్టింగ్ దుకాణం” అంటూ మరికొంత మంది ఎద్దేవా చేస్తున్నారు. ‘కాస్త పసుపు పూస్తే తగ్గిపోయే గాయానికి ఆక్సీజన్ మాస్క్ తగిలించుకుంది” అంటూ ఇంకొందరు కామెంట్స్ పెట్టారు. ఇక తాను కోలుకోవాలంటూ ప్రే చేయాలని నెటిజన్లను కోరడం పట్ల పలువురు ఫన్నీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తోంది. ట్రోలర్స్ కు మాంచి స్టఫ్ దొరకినట్లు అయ్యింది.
తెలుగులో స్టార్ హీరోలతో ఆడిపాడిని ఊర్వశీ
నటి ఊర్వశీ రౌతేలా తెలుగులో పలు ఐటెమ్ సాంగ్స్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది. ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో సంపత్ నంది ఓ ప్రాజెక్టును కూడా ప్లాన్ చేశారు. అయితే, ఇంత వరకు దాని గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. తెలుగు సినిమాల పట్ల ఆమెకు ఇష్టం ఉన్నా, అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. హీరోయిన్ గా ఇక్కడ సరైన ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అక్కడ రాణిస్తోంది.
Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?