NBK 107 Movie Update: బాలయ్య ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్, కొండారెడ్డి బురుజు సాక్షిగా అదిరిపోయే అప్‌డేట్!

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా NBK 107. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ డేట్, టైమ్, ప్లేస్ ఫిక్ అయ్యింది.

Continues below advertisement

‘అఖండ’ లాంటి సినిమాతో దుమ్మురే హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా మరో సినిమాలో నటిస్తున్నారు. మాస్ సినిమాల దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి 107వ  సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సినిమా యూనిట్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసింది. బాలయ్య బర్త్ డే కానుకగా ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య పోలీసు అధికారిగా కనిపించనున్నారు. బాలయ్య ఇప్పటి వరకు పోలీసుగా నటించిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.  

Continues below advertisement

కొండారెడ్డి బురుజు సాక్షిగా టైటిల్ లాంచ్

తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్ డూపర్ అప్ డేట్ వచ్చింది.  మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ వివరాలను చిత్ర బృందం వెల్లడించింది. NBK 107 టైటిల్‌ ను కర్నూలు వేదికగా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలిపారు. కొండారెడ్డి బురుజు సాక్షిగా అక్టోబర్ 21 రాత్రి 8.15 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ను వెల్లడించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్స్ ఇవేనంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ‘రెడ్డిగారు’ కాగా, మరొకటి ‘జై బాల‌య్య’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు చర్చ నడుస్తున్నది. ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఫైనల్ అవుతుందని సమాచారం.    

కీలక పాత్రల్లో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీలో నటసింహం రెండు గెటప్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో లేడీ విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ ను తీసుకున్నారట. ఇందులో కూడా తను పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ, మలినేని కాంబోలో వచ్చిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మగా నటించిన వరలక్ష్మీ.. తన నటనతో అదరగొట్టింది. ఈ తాజా సినిమాలోనూ బాలయ్యను ఎదిరించే లేడీగా కనిపిస్తుందట.

‘అఖండ’ రిలీజ్ రోజునే విడుదలవుతుందా?

మరోవైపు బాలయ్య తాజా సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు, ఈ మూవీని సైతం ‘అఖండ’ విడులైన రోజునే అంటే, డిసెంబర్ 2న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఈ  డేట్ ఫిక్స్ కాకపోతే సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్‌పై నిర్మితం అవుతుంది. ఎస్ఎస్ తమన్​ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్ NBK-2’ పేరుతో టాక్ షో నిర్వహిస్తున్నారు. సెలబ్రిటీలను తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ అదరగొడుతున్నారు.

Read Also: ‘బాహుబలి-2’లోని ఆ సీన్‌ను దించేసిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్’ వెబ్ సీరిస్, ఇండియన్ డైరెక్టర్ పనే!

Continues below advertisement
Sponsored Links by Taboola