గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలు. డిసెంబర్ 8న పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. 


ఎన్‌బికె 108లో శరత్ కుమార్
బాలకృష్ణ 108వ చిత్రమిది. అందుకని, NBK 108 వర్కింగ్ టైటిల్‌తో జనాల్లోకి తీసుకు వెళుతున్నారు. వినోదంతో పాటు వాణిజ్య విలువలు జోడించి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నటుడు శరత్ కుమార్ (Sarathkumar) కూడా ఉన్నారు. ఆయనతో దిగిన ఫోటోను అనిల్ రావిపూడి షేర్ చేశారు. సినిమాలో ఆయనది కీలకమైన క్యారెక్టర్ అని చెప్పారు.


ఒక్క ఫోటోతో అనిల్ రావిపూడి ప్రేక్షకులకు మరో క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ మధ్య శరత్ కుమార్ చెన్నైలో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన తీవ్ర అస్వస్థత చేసినట్లు సమాచారం వచ్చింది. 'ఎప్పటిలా ఆయన ఫిట్ గా ఉన్నారు' అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. దాంతో శరత్ కుమార్ హెల్త్ సెట్ అయ్యిందని పరోక్షంగా చెప్పారు.






 
 
బాలకృష్ణ... తమన్... హ్యాట్రిక్
ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు 'డిక్టేటర్' చిత్రానికి ఆయన సంగీతం అందించినా... 'అఖండ'తో భారీ విజయం సాధించారు. బాలకృష్ణ, తమన్ కలయికలో 'అఖండ', వీర సింహా రెడ్డి', ఇప్పుడీ సినిమా... లేటెస్ట్ హ్యాట్రిక్ ఇది. 


Also Read : ఇండియాలో 'అవతార్ 2'ది రెండో స్థానమే - ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?


తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ అంజలి (Anjali) కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.  


'వీర సింహ రెడ్డి' టాకీ పూర్తి చేసిన బాలకృష్ణ    
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న 'వీర సింహా రెడ్డి' టాకీ పార్ట్ షూటింగును బాలకృష్ణ పూర్తి చేశారు. అందులో సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒక్క పాట అంటే రెండు మూడు రోజులు కేటాయిస్తే సరిపోతుంది. అనిల్ రావిపూడి సినిమాకు ఫుల్ డేట్స్ కేటాయించారని తెలిసింది. ఆల్రెడీ 'వీర సింహా రెడ్డి' నుంచి విడుదలైన 'జై బాలయ్య...', 'సుగుణ సుందరి...' పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా 'సుగుణ సుందరి'లో బాలకృష్ణ, శృతి హాసన్ వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తున్నాయి.  


అనిల్ రావిపూడి సినిమా తర్వాత కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్' (Aditya 999 Movie) సెట్స్ మీదకు వెళ్ళనుంది. దానికి బాలకృష్ణ స్క్రిప్ట్ రాస్తున్నారు. అంతే కాదు... ఆయనే డైరెక్ట్ చేయనున్నారు (Balakrishna Will Direct Aditya 999).    


కథానాయికగా ప్రియాంకా జవాల్కర్
బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar) ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆమెకు ఫోటో షూట్ చేశారు. విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సత్యదేవ్ 'తిమ్మరుసు', కిరణ్ అబ్బవరం 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో ప్రియాంకా జవాల్కర్ పేరు తెచ్చుకున్నారు. ఆమె లాస్ట్ సినిమా 'గమనం'. అందులో శివ కందుకూరికి జోడీగా నటించారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ వస్తే ఆమె మరో మెట్టు ఎక్కినట్టే.


Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?