Nayanatara Vignesh- Netflix: లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆమె సినిమాలే కాదు, ప్రేమలు కూడా హాట్ టాపిక్కే అభిమానులకు. ఎట్టకేలకు తానెంతో ప్రేమించిన విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడింది నయనతార. ఆ పెళ్లి హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీగా చెల్లించి సొంతం చేసుకుంది. అయితే విఘ్నేష్, నయనతార తమ పెళ్లి ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఆ విషయంలో నెట్ ఫ్లిక్స్, కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు పెళ్లికి తాము ఖర్చుపెట్టిన సొమ్మును కూడా వెనక్కి ఇవ్వమని నెట్ ఫ్లిక్స్ అడిగిందని కూడా టాక్ నడిచింది. దాదాపు పాతిక కోట్ల రూపాయల దాకా ఈ సెలెబ్రిటీ జంట ఆ ఓటీటీ సంస్థకు చెల్లించాల్సి రావచ్చు అంటూ చాలా చర్చలు నడిచాయి. అయితే ఇదంత ఉత్త ట్రాష్ అని కొట్టిపడేసేలా నెట్ ఫ్లిక్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. త్వరలో అందమైన జంట ప్రేమకథను స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించిది. దీంతో ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్టు అయింది. ఆ పోస్టులో నయనతార - విఘ్నేష్ అందమైన ఫోటోలను షేర్ చేసింది నెట్ ఫ్లిక్స్. సముద్ర తీరాన అందమైన జంట కనుల పండవలా కనిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ప్రకారం త్వరలోనే వీరిద్దరి అందమైన ప్రేమ కథ, పెళ్లి తంతు స్ట్రీమింగ్ కానుంది.
ఏడేళ్ల ప్రేమ
నయన తార ప్రేమలో రెండు సార్లు పెళ్లి దాకా వెళ్లి వెనక్కి వచ్చింది. ఆమె లవ్ ఫెయిల్యూర్ స్టోరీలు కూడా ఆసక్తికరమే. చివరికి విఘ్నేష్ తో ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉంది. వారిద్దరూ సహజీవనం కూడా చేశారని చెబుతారు. ఇరువురి కుటుంబీకుల సమ్మతితో ఈ ఏడాది జూన్ 9న తమిళనాడులోని మహాబలేశ్వరంలోని ఓ పెద్ద రిసార్టులో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను పాతికకోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ కొనుక్కుంది. వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. ఇక తమిళ నటులు రజనీకాంత్, సూర్య, జ్యోతిక, మణిరత్నం వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారిని ఒక్కరిని నయన తార పిలవకపోవడం ఆశ్చర్యం. పోనీ ఇక్కడ తెలుగు సెలెబ్రిటీల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తుందేమో అనుకున్నారు అభిమానులు. కానీ అలాంటిదేమీ జరగలేదు.