Namrata-Nara Brahmani: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ముంబైలో పుట్టి పెరిగిన టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. 'వంశీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె 'అంజీ' సినిమాలో మెగాస్టార్ సరసన అలరించింది. మహేష్‌తో పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఇంటి వ్యవహరాలతో పాటు మహేష్ బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటుంది. సామాజిక కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటుంది. భర్త మహేష్‌తో కలిసి ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నది. సినిమాలోనూ భర్తకు అండగా ఉంటూ, పిల్లలను చూసుకుంటూ గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది.
అట్టహాసంగా నమ్రత బర్త్ డే వేడుకలు
ఇక ఇటీవల (జనవరి 22న) నమ్రత తన పుట్టిన రోజు వేడుక జరుపుకుంది. 34 నుంచి 35వ వసంతంలోకి అడుగు పెట్టింది. బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. కూతురు సితార, కొడుకు గౌతమ్‌తో కలిసి నమ్రత కేక్ కట్ చేసింది. నమ్రత బర్త్ డే పార్టీకి మహేష్ సోదరి మంజుల, మహేష్ ఇంకో అక్క, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, పలువురు ఫ్యాషన్ డిజైనర్లతో పాటు మరికొంతమంది నమ్రత ఫ్రెండ్స్ హాజరయ్యారు. బర్త్ డే ఫొటోల్లో నమ్రత ఫుల్ ట్రెండీ లుక్‌లో నమ్రత ఆకట్టుకుంది. బ్లాక్ కలర్ మ్యాక్స్ టాప్‌లో నమ్రత మరింత యంగ్ కనిపించారు.
స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన నారా బ్రహ్మణి
ఇక ఈ పార్టీలో నారా బ్రహ్మణి కూడా పాల్గొన్నారు. అంతేకాదు, ఈ వేడుకలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బర్త్ డే సెలబ్రేషన్స్ అనంతరం, నమ్రత సోషల్ మీడియా వేదికగా పార్టీ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో నారా బ్రహ్మణి కూడా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నమ్రతతో కలిసి బ్రహ్మణి క్లోజ్ గా ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నమ్రతకు ఫ్యాన్స్, నెటిజన్లు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
నమ్రత బర్త్ డే సమయంలో మహేష్ బాబు ఇండియాలో లేరు. ఇటీవల జర్మనీ వెళ్లిన మహేష్ భార్యకు సోషల్ మీడియాలో స్పెషల్ విషెస్ తెలిపాడు. నమ్రత తన లైఫ్‌లో ఎంతటి కీ రోల్ పోషిస్తుందో చెబుతూ ఆమెపై ప్రేమ కురిపించిన తీరు ఆకట్టుకుంది. "హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ(నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని).. మరొక సంవత్సరంలో అడుగుపెడుతున్న నీ జీవితంలో మరింత ప్రేమ, ఆనందం నిండాలని కోరుకుంటున్నా. అలాగే నా జీవితాన్ని ప్రతి రోజును అద్భుతం తీర్చిదిద్దుతున్నందుకు థ్యాంక్యూ. లవ్ యూ" సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
Read Also: సినిమాలు తీయడం గొప్పకాదు, వాటిని థియేటర్లలో ఆడించడం గొప్ప: దిల్ రాజు