Dil Raju About Film Making: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు బరిలో నిలిచినప్పటికీ, ‘గుంటూరు కారం’ లాంటి సినిమాలకు  ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ‘హనుమాన్’ లాంటి సినిమాలకు పెద్దగా థియేటర్లు కేటాయించలేదనే విమర్శలు వచ్చాయి. అయితే, ఈ విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంక్రాంతికి ఏదో ఒకరకంగా తనను టార్గెట్ చేస్తూ అడ్డగోలుగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాసే వెబ్‌ సైట్లు, మీడియా సంస్థలపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. వాస్తవాలు తెలియకుండా తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

  


సినిమాలు తీయడం గొప్పకాదు: దిల్ రాజు


తాజాగా ‘అలనాటి రామచంద్రుడు’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం పెద్ద విషయం కాదన్నారు. వాటిని ప్రేక్షకులు చూసేలా తీయడం గొప్ప విషయం అన్నారు. “ఈ రోజుల్లో చాలా మంది సినిమాలు తీస్తున్నారు. సినిమా తీయడం గొప్ప కాదు. ఆ సినిమాను థియేటర్లలోకి తీసుకెళ్లి ఆడించడం గొప్ప. ఇంతకు ముందు సినిమాలు తీస్తే ప్రేక్షకులు కనీసం పాస్ మార్కులు వేసే వాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బెస్ట్ కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడుతాయి. కొత్త వచ్చే ఫిల్మ్ మేకర్స్ మంచి కథలతో సినిమాలు ట్రై చేస్తే మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంటుంది” అని వెల్లడించాడు.


కృష్ణ వంశీ హీరోగా తెరకెక్కిన ‘అలనాటి రామచంద్రుడు’


అటు కృష్ణ వంశీ హీరోగా తెరకెక్కింది ‘అలనాటి రామచంద్రుడు’ సినిమా. ఈ సరికొత్త ప్రేమకథా చిత్రానికి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. మోక్ష హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.  కృష్ణ వంశీ చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. మోక్ష అందం, అభినయంతో అలరించింది. దర్శకుడు ఆకాష్ చక్కటి ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. విజువల్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. శశాంక్ మ్యూజిక్ టీజర్ మరింత హైలెట్ గా మారింది.


కొనసాగుతున్న‘గేమ్ ఛేంజర్’!


ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా ‘గేమ్ ఛేంజర్’ అనే ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా ఈ సినిమా రెడీ అవుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గత రెండు సంవత్సరాలకు పైగా ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ షూటింగ్ కారణంగా లేట్ అవుతూ వస్తోంది. గత ఏడాది మార్చి లో రామ్ చరణ్ బర్త్ డే కి టైటిల్, ఫస్ట్ లుక్ ఇచ్చాక మళ్ళీ ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ లేదు. మళ్లీ చెర్రీ బర్త్ డే వస్తున్నా, రిలీజ్ పై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు.


Read Also: ‘జై హనుమాన్‌’లో భల్లాల దేవుడు? ‘హను మాన్’లో ఆంజనేయుడి కళ్లు ఆయనవేనట!