Nanis Birthday Special: ‘దసరా‘ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని కెరీర్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఈ మూవీ తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న‘తోనూ నాని అదరగొట్టాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ రూపొందించిన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సినిమాలో కథను నడిపించిన విధానం అద్భుతంగా ఉందంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం‘ సినిమా చేస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. ఇందులో నాని పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. వారానికి ఒకసారి మాత్రమే కోపం వచ్చే సూర్య పాత్రలో నటించారు. ఈ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. ఈ సినిమా డీవీవీ దానయ్య బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆగస్టు 29న థియేటర్లలో విడుదలకానుంది. 


నానితో మూవీ అనౌన్స్ చేసిన సుజీత్


అటు నాని బర్త్ డే సందర్భంగా దర్శకుడు సుజీత్ కీలక ప్రకటన చేశారు. ఆయనతో కలిసి ‘NANI32’ మూవీ చేయబోతున్నట్లు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ సినిమా కూడా డీవీవీ దానయ్య బ్యానర్‌లోనే తెరకెక్కబోతుంది. పనిలో పనిగా, ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేశారు. వాయిలెన్స్ ను తగ్గించి మ్యూజిక్ వైపు మళ్లాలంటూ ఈ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ఇందులో కొందరు విలన్లు పరిగెడుతుంటాడు. వారిని ఓ వ్యక్తి వెంటాడి వేటాడి చంపేస్తాడు. ఆ తర్వాత అతడికి ఎలాంటి పరిస్థితి ఎదురయ్యింది అనేది ఇందులో చూపించారు. హింసాత్మకమైన వ్యక్తి అహింసాత్మకంగా మారితే అతని జీవితం ఎలా తలక్రిందులు అయ్యింది అనేది ఇందులో కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్యతోపాటు ఆయన కుమారుడు కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు.  






నానితో వేణు వెల్దండి మూవీ?


అటు నానితో ‘బలగం’ దర్శకుడు వేణు వెల్దండి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత శిరీష్ తో కలిసి వేణు నానిని కలిసి బర్త్ డే విషెష్ చెప్పారు. వాస్తవానికి ‘బలగం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వేణుతో కలిసి దిల్ రాజు మరో సినిమా చేయాలని భావిస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరు కలిసి ఓ మూవీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా శిరీష్ తో కలిసి నానిని కలవడంతో ఈ వార్త నిజమేనని తేలిపోయింది. వేణు దర్శకత్వంలో నాని హీరోగా దిల్ రాజుకు నిర్మాణ సంస్ధ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  






Read Also: ‘జవాన్’ను మించి ఉంటుంది - షారుఖ్‌తో మరో మూవీ, అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్