నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెక్కిన చిత్రం ‘దసరా’, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమాలు ఓటీటీలో పోటాపోటీగా విడుదలయ్యాయి. ముందుగా అనుకున్నట్లుగానే ఏప్రిల్ 28న నెట్ ఫ్లిక్స్ లో ‘దసరా’ విడుదల కాగా, అనుకున్న సమయానికి అంటే ముందే అమెజాన్ లో ‘రావణాసుర’ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాలు చూడని అభిమానులు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఏప్రిల్ 27న ఓటీటీలోకి 'దసరా'
తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ పల్లెలో జరిగిన కథతో ‘దసరా’ రూపొందింది. ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల అయ్యింది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 27న విడుదల చేసింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. 'దసరా'లో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించింది. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మొదలైన ఈ సినిమా, ఆ తర్వాత మహిళలను చెరబట్టే ఓ కామ పిశాచిని హీరో ఎలా అంతం చేశాడు? మద్యపానానికి మగవాళ్ళు బానిసలు కావడంతో మహిళలు పడుతున్న సమస్యలను హీరో ఎలా తొలగించాడు? అనే అంశాలతో ముగిసింది. కథానాయకుడిగా నేచురల్ స్టార్ నాని స్థాయిని ఓ మెట్టు పైకి ఎక్కించిన సినిమాగా 'దసరా' చరిత్రకు ఎక్కింది. వంద కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలించింది. తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో 'దసరా'కు మంచి ఓపెనింగ్ లభించింది.
అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి 'రావణాసుర'!
'ధమాకా' బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం 'రావణాసుర'. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజైంది. ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్లుగా ఈ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మే 5 నుంచి OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ వస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇవాళ(ఏప్రిల్ 28న) విడుదల అయ్యింది.
మాస్ హీరో రవితేజ నటించిన 'రావణాసుర' సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగినా.. చివరికి మాత్రం ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ప్రేక్షకులకు మరింత చిరాకును తెప్పిస్తాయి. కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామనుకునే లోపే మళ్లీ.. స్టోరీ దారి తప్పినట్టనిపిస్తుంది. మధ్యలో వచ్చే మ్యూజిక్, పాటలు కొన్ని సార్లు చాలా అడ్డంకిగా, బలవంతంగా స్టోరీలోకి నెట్టబడినట్టు అనిపిస్తాయి. ఇన్ని నెగెటివ్ కామెంట్స్ మధ్య 'రావణాసుర' మూవీ రవితేజ ఫ్యాన్స్ కు అత్యంత నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో రవితేజ నటిస్తున్నారు.
Read Also: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో దుమ్మురేపిన విశాల్, అంచనాలు పెంచేస్తోన్న ‘మార్క్ ఆంథోని‘ టీజర్