అందాల నటీమణి సమంత 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమెకు నెటిజన్లు, సినీ స్టార్స్ జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సమంత, అద్భుత నటనతో సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులలో ఒకరైన సమంత, లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 


1. బ్యాగ్ కలెక్షన్స్


సమంత రూత్ ప్రభు దగ్గర రూ. 1.4 లక్షల విలువైన జిజి మార్మోంట్ లవ్ మినీ స్లింగ్ బ్యాగ్ ను కలిగి ఉంది. రూ. 2.5 లక్షల విలువైన వైట్ కలర్ క్రిస్టియన్ డియో బ్యాగ్‌ని కూడా ఆమె రీసెంట్ గా కొనుగోలు చేసింది.


2. కార్ కలెక్షన్స్


సమంత గ్యారేజ్‌లో పలు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. రూ. 72 లక్షల విలువైన జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, రూ. 87 లక్షల విలువైన ఆడి క్యూ7, రూ. 2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్, రూ. 1.46 కోర్ల విలువైన పోర్షే కేమాన్ జిటిఎస్  లాంటి కార్లు కొలువుదీరాయి.


3. హైదరాబాద్ లో లగ్జరీ బంగళా


సమంతకు హైదరాబాద్ లో విలాసవంతమైన ఇల్లు ఉంది. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో ఈ బంగళాను రూపొందించారు. సమంత తరచుగా తన విశాలమైన ఇంటిలోని పెద్ద గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.


4. సొంత ఫ్యాషన్ లేబుల్‌


మిస్ ఇండియా 2016 రన్నరప్ సుశృతి కృష్ణ సహకారంతో సమంత 2020లో తన సొంత ఫ్యాషన్ లేబుల్‌ Saakiని ప్రారంభించింది. ఆమె బ్రాండ్ మంచి ప్రజాదరణ పొందింది. కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయంగా 15 దేశాలకు విస్తరించింది.


5. నికర ఆస్తుల విలువ


సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతోంది. నార్త, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాలతో పాటు ఎండార్స్ మెంట్ ద్వారా బాగా డబ్బు కూడబెడుతోంది. సమంత ప్రస్తుత నికర ఆస్తుల విలువ రూ. 89 కోట్లు అని సమాచారం. సమంత ఒక సినిమాల్లో నటించేందుకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఒక్కో సోషల్ మీడియా యాడ్ కోసం రూ. 20 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.


ఇక సమంత తాజాగా ‘శాకుంతలం’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఈమె ప్రస్తుతం అమెరికన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రంలో కనిపించనుంది.






Read Also: హ్యాపీ బర్త్ డే సామ్ - సమంత అసలు పేరే ఆ సినిమాకు టైటిల్, మూవీస్‌లోకి రాకముందు ఆమె జాబ్ ఇదే!