అందాల తార సమంతా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంలో కూడా చక్కటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సీరిస్ ఇండియన్ వెర్షన్ లో సమంతా నటిస్తోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇవాళ 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా సామ్ కు సంబంధించిన 10 ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సమంత గురించి 10 ఆసక్తికర విషయాలు
1. సమంతకు యశోద అనే మరో పేరు ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఆమెను ఆ పేరుతో పిలుస్తారు. ‘యశోద’ టైటిల్‌తో రిలీజైన మూవీ ప్రేక్షకులకు కూడా భలే నచ్చేసింది.
2. సినిమా పరిశ్రమలోకి రాక ముందు సమంత ‘వెల్‌కమ్ గర్ల్’గా పని చేసింది. పార్టీలు, ఈవెంట్‌లలో సంప్రదాయ దుస్తులు ధరించి అతిథులకు స్వాగతం పలికేది.
3. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కోలీవుడ్ చిత్రం ‘విన్నైతాండి వరువాయా’(2010)తో సమంత రంగప్రవేశం చేసిందని చాలా మంది అనుకుంటారు. కానీ, వాస్తవానికి రవి వర్మన్ దర్శకత్వం వహించిన ‘మాస్కోవిన్ కావేరి’ (2010) ఆమె తొలి చిత్రం.
4. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య, అతడి కుటుంబం ఆఫర్ చేసిన రూ.200 కోట్ల మ్యారేజ్ సెటిల్‌మెంట్‌ను తిరస్కరించిన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, అది ఎంతవరకు నిజమనేది ఇప్పటికీ రహస్యమే.
5. రేవతి తర్వాత అదే సంవత్సరంలో తమిళం, తెలుగులో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్న రెండవ నటి సమంత. 2012లో 'నీతనే ఎన్ పొన్‌వసంతం' తమిళం, 'ఈగ' తెలుగు చిత్రాలకు గాను ఆమె అవార్డులను గెలుచుకుంది.
6. 2013లో తనకు డయాబెటీస్ ఉన్నట్లు సమంత వెల్లడించింది. అయితే, కఠినమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ వ్యాధి నుంచి బయటపడింది.
7. సమంతకు బ్రిటీష్ నటి ఆడ్రీ హెప్‌బర్న్ అంటే చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూలలో ఆమె నటన అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చింది.
8. హిందీ వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటనకు గాను సమంత పలువురి ప్రశంసలు అందుకుంది.
9. సమంత సౌత్ ఇండియన్ అయినా, జపనీస్ వంటకాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. సుషీ అనే జపనీస్ వెరైటీని చాలా ఇష్టంగా తింటుంది.
10. సమంత పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం పనిచేసే ‘ప్రత్యూష సపోర్ట్’ అనే ఎన్జీవోను నడుపుతోంది.
Read Also: టైమ్ వచ్చినప్పుడు కాదు, ఇష్టం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి - ఆ యాడ్‌తో సమంత సెటైర్లు!