సైలెంటుగా తన పని తాను చేసుకుంటూ వెళ్లే హీరో నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని తాజా మూవీ ‘దసరా’. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ నేపథ్యంలో  రియలిస్టిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 30 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.


తాజాగా ఈసినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ అందించింది చిత్ర యూనిట్. ఈ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ సిల్క్ స్మిత పోస్టర్ ముందు నాని కూర్చుని ఉన్న ఫొటోతో మూవీ తేదీని వెల్లడించారు. ఇందులో నాని మాసిన గడ్డం, బట్టలతో ఒళ్లంత మట్టితో, చేతిలో మెన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్ పట్టుకుని ఉన్నారు. గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. సినీ అభిమానులను ఈ పోస్టర్ ఎంతో ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది (2023), మార్చి 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ లేటెస్ట్ పోస్టర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా మీద అంచనాలు పెంచేలా ఈ పోస్టర్ ను రూపొందించింది. 


తెలంగాణలోని గోదావ‌రిఖ‌ని సమీపంలో ఉన్న సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ కంప్లీట్ కాగా.. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలయినట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా నిర్మాతలు తమ సమస్యల పరిష్కారం కోసం షూటింగులను నిలిపివేశారు. తాజాగా సినిమా షూటింగులు జరుపుకోవచ్చు ఫిలిం ఛాంబర్ అనుమతులు ఇచ్చింది. దీంతో ‘దసరా’ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైంది.


ఈ సినిమా పుష్ప మాదిరిగానే లోకల్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో కొనసాగుతోంది. ఈ మూవీపై నాని అండ్ టీమ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు తన తొలి సినిమానే భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు కొత్తవాడయినా ప్రతి సీన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.


దసరా సినిమాలో నానికి జోడిగా కీర్తిసురేష్ నటిస్తోంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్‌, తమిళ నటుడు సముద్ర ఖని ఇందులో కీలక  పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా విడుదలకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.






Also Read : 'లైగర్' రివ్యూ : విజయ్ దేవరకొండ పంచ్ అదిరిందా? లేదా? పూరి ఏం చేశారు?



Also Read : హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మొదటి ఎపిసోడ్ రివ్యూ: గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్థాయిని అందుకుందా?