అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం నల్లమల. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఏమున్నవే పిల్లా పాట యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబదించిన టీజర్ ను  రామానాయుడు స్టూడియోలో దర్శకుడు దేవకట్టా చేతుల మీదుగా విడుదల చేసింది చిత్రయూనిట్. 



నల్లమల చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రవి చరణ్. అమిత్ తీవారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా..నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, షవర్ అలీ, ఛత్రపతి శేఖర్, కాశీ విశ్వనాథ్, చలాకి చంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నవే పిల్లా పాట యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. 



నల్లమల అడవి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోంది `న‌ల్ల‌మ‌ల‌`. ‘‘సేవ్‌ నల్లమల’ అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అవినీతి ఒప్పందాలకు వ్యతిరేకంగా భవిష్యత్‌ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కరించాడనే వాస్తవ సంఘటనల సమాహారమే ఈ సినిమా అన్నాడు దర్శకుడు రవిచరణ్.వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుందన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. గతంలో ఎన్నో సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మెప్పించిన అమిత్ మరి హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. 


Also Read: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్పోర్ట్స్ డ్రామా ‘MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’గురించి ఈ ఆరు ముఖ్యమైన విషయాలు మీకు తెలుసా


Also Read: జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇది...నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్


Also Read: హౌస్ లో 'ఆకలిరాజ్యం' కష్టాలు.. ఫుడ్ కోసం ఏకంగా చెత్తబుట్టలో..


Also Read: 'వల్గర్ ఆంటీ.. చీప్' అంటూ జెనీలియాపై దారుణమైన కామెంట్స్.. ఘాటు రిప్లై ఇచ్చిన బ్యూటీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి