డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. వెరైటీ రోల్స్ ఎంచుకుంటూ సినిమాలు చేయడంలో యువహీరో నాగశౌర్య స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ‘కృష్ణ వ్రింద విహారి’ అనే సినిమా చేశాడు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. షెర్లీ సేతియా, రాధికా శరత్ కుమార్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిచారు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో ఆయన బ్రాహ్మణ యువకుడి క్యారెక్టర్ లో నటించాడు.
ఒక మోడ్రన్ అమ్మాయి, ఓ ట్రెడిషనల్ అబ్బాయిల మధ్య ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చినా కాస్త హాస్యం పాళ్లు ఎక్కువగా జోడించాడు దర్శకుడు. నార్త్ ఇండియాలో పెరిగిన అమ్మాయి, సంప్రదాయాల మధ్య పెరిగిన అబ్బాయి ఇంటికి కోడలిగా వస్తే ఎదురయ్యే కష్టాలను చూపించాలని ప్రయత్నించాడు. ఇటీవలే వచ్చిన ‘అంటే సుందరానికీ’ సినిమా కూడా ఇంచుమించు ఇదే కథతో వచ్చిందని చెప్పుకోవచ్చు.
రొటీన్ కు భిన్నంగా ఉండే ప్రేమ కథలు చేయడంతో పాటు అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్య ఎవరూ ఊహించని ‘లక్ష్య’ అనే డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందున్నాడు. అంతకు ముందు చేసిన సినిమాలు అన్నీ కూడా నాగశౌర్య ఏదో ఒక కొత్త పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉన్నాడు.
నాగ శౌర్యకు జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరి బంధుత్వం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ రూమర్స్ కు సపోర్టు చేసేలా నాగశౌర్య పలు ఇంటర్వ్యూ లలో నందమూరి ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెప్పేవాడు, పొగిడే వాడు. ఆ వార్తలు ఎన్నిసార్లు వైరల్ అయినా ఇరు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఇదే అంశంపై నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు.
ఎన్టీఆర్ భార్య ప్రణతి తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పాడు. ఆమె బ్రదర్ తనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కావడం మూలంగా ప్రణతిని చిన్నప్పటి నుంచి చెల్లి అని పిలిచేవాడినని చెప్పాడు. “నాకు చాలా కాలంగా పూజిత్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ల సిస్టర్ ను తారక్ పెళ్లి చేసుకున్నాడు. ప్రణతిని చెల్లి, చెల్లి అంటూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి తను నాకు బాగా తెలుసు. చాలా మంది నన్ను ప్రణితి కజిన్ అనుకుంటారు. కానీ, అందులో నిజం లేదు. పూజిత్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగానే ప్రణతి తెలుసు అంతే” అని చెప్పాడు.