సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది టాలెంటెడ్ యూత్ బయటకు వస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ లు, కామెడీ వీడియోలు, కవర్ సాంగ్ లు ఇలా ఎవరికి తెలిసిన టాలెంట్ తో వాళ్లు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా యూట్యూబ్ లో కవర్ సాంగ్ లు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు వినయ్ షణ్ముఖ్. వినయ్ షణ్ముఖ్ గురించి యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి దాదాపు తెలిసే ఉంటుంది. యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ లకు దర్శకత్వం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు మరో కవర్ సాంగ్ తో ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ పాటకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశాడు వినయ్. ‘లేత చిగురుల వలే ఏవో ఆశలే..’ అంటూ సాగే ‘మైరా’ సాంగ్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ కూడా వస్తున్నాయ్.  


ఈ పాటలో నటీనటులుగా సుమంత్ ప్రభాస్, ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ ఫేమ్ అనన్య నటించింది. ఈ పాటకు వినయ్ షణ్ముఖ్ దర్శకత్వం వహించగా విజయ్ బల్గానిన్ మ్యూజిక్ అందించారు. సురేష్ బానిశెట్టి లిరిక్స్ అందించగా.. దివ్యశ్రీ, వినయ్ షణ్ముఖ్, విజయ్ బల్గానిన్ నిర్మించారు. ఇక ఈ కవర్ సాంగ్ లో ఫ్రేమ్స్ కూడా చాలా అందంగా తెరకెక్కించాడు వినయ్. వినయ్ షణ్ముఖ్ విశాఖకు చెందిన వ్యక్తి. వినయ్ 2016లో డిఓపి గా తన కెరీర్ ప్రారంభించాడు. తర్వాత షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనాతో కలసి ‘యు అండ్ మి’ కవర్ సాంగ్ ను చేశాడు. ఈ కవర్ సాంగ్ మంచి సక్సెస్ ను అందుకుంది. తర్వాత వినయ్ డైరెక్టర్, ఎడిటర్ గా మారాడు. వినయ్ వైష్ణవి చైతన్య, మెహబూబ్ దిల్సే, సిరి హనుమంతు, శ్రీహాన్, సుమంత్ ప్రభాస్, షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన, అర్జున్ కళ్యాణ్ వంటి యూట్యూబ్ స్టార్స్ అందరితో కలసి పనిచేశాడు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసుకొని వరుస కవర్ సాంగ్స్ తో దూసుకుపోతున్నాడు వినయ్.