రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలోనూ సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ అనే పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును అందుకుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ ఐకానిక్ పాట వెనుకున్న ప్రముఖ సంగీత స్వరకర్త ఎం ఎం కీరవాణి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఎన్నో అద్భుత పాటలను రూపొందించారు. వాటిలో టాప్ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1.టు మైల్ - క్రిమినల్ (1995)
సంగీత దర్శకుడు కీరవాణి 90వ దశకంలో పలు అద్భుత పాటలను రూపొందించారు. వాటిలో బాగా పాపులర్ అయిన సాంగ్ ‘టు మైల్’. నాగార్జున, రమ్య కృష్ణ, మనీషా కొయిరాలా నటించిన మహేష్ భట్ సినిమా ‘క్రిమినల్’లోని ఈ పాటను కుమార్ సాను, చిత్ర, అల్కా యాగ్నిక్ పాడారు.
2.గలీ మే ఆజ్ చాంద్ నిక్లా - జఖ్మ్ (1998)
మహేష్ భట్ దర్శకత్వంలో ఆయన కుమార్తె పూజా భట్ నటించిన ‘జఖ్మ్’(1998) సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని ‘గలీ మే ఆజ్ చాంద్ నిక్లా‘ అనే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఆల్కా యాగ్నిక్ పాడిన ఈ పాటను ఆనంద్ బక్షి రాశారు.
3.శివుని ఆనా - బాహుబలి: ది బిగినింగ్
‘RRR‘ రాజమౌళి ‘బాహుబలి‘ చిత్రాలతో భారతీయ దిగ్గజ దర్శకుడిగా పేరు పొందారు. ‘బాహుబలి‘ పార్ట్ 1లోని ‘శివుని ఆనా‘ అనే పాట దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
4.సాహోరే బాహుబలి - బాహుబలి: ది కన్‌క్లూజన్
‘బాహుబలి‘ రెండవ భాగంలోని ‘సాహోరే బాహుబలి‘ అనే పాట సైతం దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. సినీ అభిమానులను ఈ పాట ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది.
5.పహేలి - ధీరే జల్నా (2005)
‘ధీరే జల్నా‘ సినిమాలోని ‘పహేలి‘ పాటను వింటే ఎంతో మధురంగా అనిపిస్తుంది. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన సినిమాలోని పాటను సోను నిగమ్, శ్రేయా ఘోషల్ పాడారు. కీరవాణి స్వరపరిచారు.
6.ఆ భీ జా ఆ భీ జా - సుర్ (2002)
2002లో విడుదలైన ‘సుర్‘ సినిమాలోని ఈ పాట ఇప్పటికీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ సినిమాలోని అన్ని పాటలు అద్భుతంగా ఉన్నా, ఈ పాట మరింత పాపులర్ అయ్యింది. లక్కీ అలీ పాడిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు.
7.జాదు హై నషా హై - జిస్మ్ (2003)
బిపాసా బసు, జాన్ అబ్రహం నటించిన ‘జిస్మ్’ సినిమాలోని ‘జాదు హై నషా హై’ అనే ఐకానిక్ ట్రాక్ 20 ఏండ్ల నుంచి సంగీత అభిమానులకు ఎంతో ఇష్టంగా మారింది. ఇప్పటికీ పలువురి నాలికపై ఈ పాట మెదలాడుతూనే ఉంటుంది.
8.ఓ సాథియా - సాయా (2003)
జాన్ అబ్రహమ్ నటించిన ఈ సినిమాలో ‘ఓ సాథియా’ అనే పాటను ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ పాడారు. ఆనంద్ బక్షి ఈ పాటను రచించారు.
9.కంగనా రే - పహేలి (2005)
షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన ‘పహేలి’లోని అద్భుత పాట ‘కంగనా రే’. ఈ పాటను శ్రేయా ఘోషల్, మధుశ్రీ, బేలా షెండే పాడారు.
10.నీతో ఉంటె చాలు – బింబిసార(2022)
నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన తెలుగు ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘బింబిసార’లోని పాట ‘నీతో ఉంటె చాలు’. శాండిల్య పిసాపతి పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతో అలరిస్తోంది.
Read Also: 'RRR’ బాలీవుడ్ మూవీ కాదు, అసలు విషయం చెప్పిన దర్శకుడు రాజమౌళి!