Mukesh Ambani: భారత ప్రపంచ వినోద కేంద్రంగా మారడానికి వేవ్ సమ్మిట్ ఉపయోగపడుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025) ప్రారంభ సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఈ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
మోదీ దార్శనికతకు సాక్ష్యం వేవ్స్ సమావేశం
ప్రధానమంత్రి మోదీ వేవ్స్ సమావేశానికి కొన్ని నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆవిష్కరణ, సంస్కృతి , సహకారానికి ప్రపంచ కేంద్రంగా ఎగడం అనేది భారత్ లక్ష్యాల్లో ఒకటి. ప్రపంచ వేదికపై భారతదేశం స్వరాన్ని విస్తృతంగా వినిపించేలా చేసేందుకు ఈ సమావేశం ఎంతో కీలకం. మోదీ దార్శనికత ఇప్పుడు వాస్తవమైందని ముకేష్ అంబానీ అన్నారు. 90 దేశాల నుండి ప్రతినిధులు వచ్చారని.. పది వేల మంది వేవ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఇది నయా భారత్ జోష్ , స్ఫూర్తి అన్నారు.
భారత వినోద పరిశ్రమ నిజమైన శక్తి
పెద్ద కలలు కనడం..వాటిని సాధించడానికి వేగంగా కష్టపడటం .. ప్రపంచ ప్రమాణాలను అధిగమించాలనే దృఢ సంకల్పంతో ప్రయత్నించడం ముఖ్యమని ముఖేష్ అంబానీ అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేసిన అశ్విని వైష్ణవ్ బృందానికి పూర్తి సహాయసహకారాలు అందిద్దామని పిలుపునిచ్చారు. " భారతదేశ వినోద , సాంస్కృతిక పరిశ్రమ కేవలం మృదువైన శక్తి మాత్రమే కాదు - అది నిజమైన శక్తి " అని ముఖేష్ అంబానీ వర్ణించారు. అల్లకల్లోలంగా, అనిశ్చితంగా మారుతున్న ప్రపంచంలో మన కథలు ఐక్యంగా, స్ఫూర్తినిపెంచడానికి శక్తితో మెరుగైన భవిష్యత్తు కోసం ఆశను ఇస్తాయని ముఖేష్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు.
రామాయణ, మహాభారతాల్లో ఎన్నో కథలు
5,000 సంవత్సరాలకు పైగా ఉన్న చరిత్రలో రామాయణం , మహాభారతం నుండి జానపద కథలు నుంచి క్లాసిక్‌ల వరకు కాలాతీత కథల అపారమైన సంపద మన దగ్గర ఉందని అంబాని గుర్తు చేశారు. ఎన్నో భాషలలో ఇవి అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటాయి. ఇవన్నీ సార్వత్రిక మానవ విలువలు, సోదరభావం, కరుణ, ధైర్యం, ప్రేమ, అందం , ప్రకృతి పట్ల శ్రద్ధకు సాక్ష్యాలుగా ఉంటాయని తెలిపారు. భారత దేశం నుంచి ఉన్న కథల శక్తికి మరే దేశం సాటి రాదన్నారు. విభజనకు గురవుతున్ న సమాజాన్ని భారత కథల ద్వారా.. సృజనాత్మకతతో కలిపాలని ఆకాంక్షించారు.
సృజనాత్మకత మాత్రమే కాదు అద్భుతమైన వ్యాపార అవకాశాలు కూడా ! మోదీ దార్శనిక నాయకత్వంలో, భారతదేశం అగ్రశ్రేణి డిజిటల్ దేశంగా మారిందని ముఖేష్ అంబానీతెలిపారు. కథలకు , డిజిటల్ టెక్నాలజీని అన్వయించడం భారత్‌కే ప్రత్య్కమైనదన్నారు. AI తో పాటు ప్రేక్షకుడ్ని లీనం చేసే టెక్నాలజీ లీనమయ్యే సాంకేతిక సాధనాలు మన కథలను గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా చేస్తాయన్నారు. వేగంగా భాషలు, దేశాలకు వేగంగా చేరువ చేస్తుందన్నారు. ఇది కేవలం సాంస్కృతిక లేదా సృజనాత్మక అంశాలకు మాత్రమే సంబంధించినది కాదన్నారు. ఇది వ్యూహాత్మక ఆర్థిక అవకాశం కూడా అని గుర్తు చేశారు. భారతదేశ మీడియా , వినోద పరిశ్రమ నేడు 28 బిలియన్ డాలర్ల విలువైన దశకు చేరుకుంది. ఇది వచ్చే దశాబ్దంలో $100 బిలియన్లకు పైగా పెరుగుతుందని న్నారు. ఈ వృద్ధి అనేక ఆవిష్కరణలకు కారణం అవుతుంది.. మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ఈ ప్రభావం కనిపిస్తుందన్నారు.
మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని భారత్ ఓడిస్తుంది
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని అంబానీ తీవ్రంగా ఖండించారు. అనాగరిక ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని మోదీ ఎంతో అసాధారణ బాధ్యతల్లో ఉన్నప్పటికీ వేవ్స్ ప్రారంభ కార్యక్రమానికి రావడం ఒక బలమైన సందేశాన్ని పంపుతుందని ముకేష్ అంబానీ అననారు. విశ్వాసం, ఐక్యత , అచంచలమైన సంకల్పం మోదీలో ఉన్నాయన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో మోదీకి 145 కోట్ల మంది పూర్తి మద్దతు ఉందని అన్నారు.