Taapsee Pannu Post On Influencer Misha Agarwal Died Due To Social Media Followers Drop: సోషల్ మీడియా.. ఒక్క రోజులోనే ఎవరినైనా ఫేమస్‌గా మార్చేస్తుంది. కొందరు దీన్నే ప్రొఫెషన్‌గా మార్చుకుంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా డబ్బులు సంపాదిస్తూ ఫేమస్ అవుతుంటారు. అయితే.. అదే పిచ్చి కొన్నిసార్లు ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ (Misha Agarwal) ఘటనే దీనికి ఉదాహరణ.
ఫాలోవర్స్ తగ్గారని..
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన 25వ బర్త్ డేకు 2 రోజుల ముందు ఏప్రిల్ 24న సూసైడ్ చేసుకున్నారు. చిన్న వయసులోనే ఆమె ఇలా చేయడంపై పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా మిషా సూసైడ్‌కు గల కారణాలను ఆమె కుటుంబ సభ్యులు వివరించారు.
సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ తగ్గారనే మిషా ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మిషా తన ఇన్ స్టా ఫాలోవర్లే ప్రపంచం అనుకుందని.. 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అయితే, ఆమె అనుకున్న దాని కంటే ఫాలోవర్స్ తగ్గుతూ వచ్చారని.. ఏకంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.
Also Read: 'రెట్రో' ట్విట్టర్ రివ్యూ - సూర్య ఖాతాలో మరో హిట్ పడిందా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
జడ్జ్ అవుతుందనుకుంటే..
'నా ఇన్ స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నారు. నా కెరీర్ ముగిసినట్లే.. అని తరచూ బాధ పడితే ఇన్ స్టాగ్రామే సర్వస్వం కాదని.. ఏమీ కాదని మేము ఓదార్చేవాళ్లం. ఎల్ఎల్‌బీ కంప్లీట్ చేసి పీసీఎస్‌జేకు ప్రిపేర్ అవుతున్నావ్. త్వరలోనే జడ్జివి అవుతావు. కెెరీర్ గురించి భయపడాల్సిన పని లేదని వెన్నుతట్టాం. కానీ.. ఆమెకు మా మాటలు వినిపించలేదు. ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రాణాలు తీసుకునే వరకూ వెళ్తుందని మేం అనుకోలేదు.' అంటూ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ వెల్లడించారు.
నేను ముందే భయపడ్డా..
ఈ ఘటనపై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ తాజాగా స్పందించారు. ఇలాంటి రోజు వస్తుందని తాను ముందే భయపడ్డానని అన్నారు. 'ప్రస్తుతం సోషల్ మీడియాపై ప్రతీ ఒక్కరికీ ఉన్న క్రేజ్ చూసి ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడో భయపడ్డా. మన లైఫ్‌ను మనం ప్రేమించడం కంటే ఫాలోవర్స్ సంఖ్యకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తామని.. చుట్టూ ఉన్న వారు చూపించే నిజమైన లవ్ కంటే ఆన్ లైన్ ప్రేమకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామని భయపడ్డా. అలాగే మనం కష్టపడి ఏళ్ల పాటు చదువుకున్న డిగ్రీలను లైక్స్, కామెంట్స్ అధిగమిస్తాయని ముందే ఊహించాను. నా హార్ట్ బద్దలైంది. ఈ రోజు ఇలాంటి ఘటన చూడడం నిజంగా బాధాకరం.' అంటూ పోస్ట్ పెట్టారు.