అదిరిపోయే హిట్టుకోసం ఎదురుచూస్తున్న అఖిల్ లేటెస్ట్ మూవీ..మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా లెహ‌రాయి అనే సాంగ్ విడుద‌ల చేశారు.



'లెహరాయి లెహరాయి.. గుండె ఊహలెగిరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి.. గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి.. ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి.. కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లె చేరుతుంటే.. ప్రాణమంత చెప్పలేని హాయి..' అంటూ సాగిన ఈ రొమాంటిక్ సాంగ్ సంగీత ప్రేమికులను అలరిస్తోంది. అఖిల్‌, పూజా హెగ్డే మ‌ధ్య రొమాన్స్ చూసి ప్రేక్షకులు ఫుల్ థ్రిల్‌గా ఫీల‌వుతున్నారు. శ్రీమ‌ణి లిరిక్స్ అందించ‌గా, సిద్ శ్రీరామ్ ఈ పాట ఆలపించారు. గోపి సుంద‌ర్ స్వరాలు సమకూర్చారు.  రఘు మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
Also read: బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ ఇద్దరూ వైల్డ్ కాల్డ్ ఎంట్రీ.. ఇక కథ వేరే ఉంటదా..!
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వస్తుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' పాటల మాదిరిగానే 'లెహరాయి' కూడా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆమని, ఈషా రెబ్బా , చిన్మయి, వెన్నెల కిషోర్, మురళీశర్మ, జయప్రకాష్ ,ప్రగతి , అమిత్ తివారి, సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటించారు.


Also read: యాభై ఏళ్లు దాటాయంటే నమ్మగలరా…ఎవ్వర్ గ్రీన్ బ్యూటీకి హ్యాపీ బర్త్ డే


‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అఖిల్‌.. ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సినిమాల్లో నటించినా సరైన సక్సెస్ అందించ‌లేక‌పోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం ప‌క్కా హిట్ ఇస్తుంద‌నే నమ్మకంతో ఉన్నాడు అఖిల్. ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.


Also read: నీలాంబరి నుంచి శివగామి వరకూ అందంతో పాటూ నటనలోనూ సరిలేరు తనకెవ్వరు అనిపించుకున్న రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్


Also read: కనీసం నిలబడలేకపోతున్నాడని చెప్పారు, పోలీసులపై ఎదురుకాల్పులు ఎలా జరుపుతాడు, నా భర్తను పోలీసులే హత్య చేశారన్న చెన్నకేశవులు భార్య రేణుక