ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి హాస్పిటల్ పాలయ్యారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అనారోగ్యం కారణంగా ఆయన్ను జాయిన్ చేశారు. బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా ఆయన త్వరగా కోలుకోవాలని ఆసిస్తూ హాస్పిటల్ లోని ఆయన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉన్న మిథున్ చక్రవర్తి ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. 


సడెన్ గా మిథున్ చక్రవర్తి హాస్పిటల్ పాలవ్వడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన రెండో కుమారుడు మిమో చక్రవర్తి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ మీడియా పోర్టల్ తో మాట్లాడుతూ.. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 


ఆయనకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని.. అందుకే ఏప్రిల్ 30న హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు చెప్పారు. ఆయనకు ఆపరేషన్ జరిగిందని.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయి ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 1980, 90లలో మిథున్ చక్రవర్తి హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో తన సత్తా చాటారు. ఆయన చివరిగా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో కీలకపాత్ర పోషించారు. 


Also Read: రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఫ్లాప్స్ తప్పవా? అసలు కారణాలు ఏంటి??


Also Read: కొరటాల శివకు కండిషన్లు పెట్టిన ఎన్టీఆర్?