సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి, ప్రేక్షకులు అందరూ మెచ్చే సినిమాలు తీయడం దర్శకుడు కొరటాల శివ శైలి. దర్శకుడిగా ఆయన తొలి సినిమా 'మిర్చి' నుంచి 'భరత్ అనే నేను' ఆయన ప్రయాణం విజయవంతంగా సాగింది. అయితే, 'ఆచార్య' ఈ విషయంలో ఆయన లెక్క తప్పింది. సాధారణ ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే‌.‌.. మెగా అభిమానులను మెప్పించడంలోనూ సినిమా విఫలమైంది. ఆచార్య పరాజయం తర్వాత కొరటాల శివ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. వాటిని పక్కన పెడితే... పరి సినిమా విషయంలో ఆయనపై ఒత్తిడి నెలకొందని ఇండస్ట్రీ వర్గాల కథనం.


'ఆచార్య' విడుదలకు ముందే... ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సినిమా చేయడానికి కొరటాల శివ కమిట్ అయ్యారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కూడా ఇదే. ఆచార్య ఫలితం నేపథ్యంలో కొరటాల శివకు ఎన్టీఆర్ కండిషన్లు పెట్టారనే మాట ఇండస్ట్రీ లో వినపడుతోంది. విషయం ఏమిటంటే...


'ఆచార్య' ఫలితం నుంచి కోలుకోవడానికి కొరటాల శివను చిన్న బ్రేక్ తీసుకోమని ఎన్టీఆర్ సజెస్ట్ చేశారట. అంతే కాదు... స్క్రిప్ట్ మీద మరోసారి వర్క్ చేయమని సూచించారని ఫిలిం నగర్ వర్గాల టాక్. NTR 30 స్టోరీ లైన్, స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ చేశారు. ఇప్పుడు మరోసారి కథ మీద కూర్చోమని ఎన్టీఆర్ క్లారిటీగా చెప్పారట. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలలో అసలు జోక్యం చేసుకోవద్దని కొరటాలకు ఎన్టీఆర్ గట్టిగా చెప్పినట్లు సమాచారం.


తొలుత జూన్ నెలలో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నప్పటికీ... ఈ ఫలితం నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ మరి కొంత ఆలస్యంగా మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


కొరటాల, ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ‌యంగ్ టైగర్ కు 'జనతా గ్యారేజ్' వంటి హిట్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఈ దర్శకుడి. అలాగే ఎన్టీఆర్ ఇమేజ్ చేంజోవర్ కు దోహదపడిన సినిమాలలో ఒకటైన 'బృందావనం'కు కొరటాల రైటర్. అందువల్ల, 'ఆచార్య' విషయంలో తప్పు ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? అనేది ఎనలైజ్ చేసుకుని ముందుకు వెళ్లాలని కొరటాల శివ, ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట. 


Also Read: రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఫ్లాప్స్ తప్పవా? అసలు కారణాలు ఏంటి??


ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్‌ లీడ‌ర్‌గా కనిపించనున్నారు. ఇంపార్టెంట్ మేటర్ ఏంటంటే... బస్తీలో చదువుకునే పేద విద్యార్థుల హక్కుల కోసం, ఆ పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వంతో ఎటువంటి పోరాటం చేసే నాయకుడిగా ఆయన కనిపించనున్నారని తెలిసింది. ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకుడు ఎలా ఢీ కొన్నాడు? అనేది కథ (NTR30 Story Line). రాజకీయాలు, రాజకీయ నాయకులతో ఓ విద్యార్థి చేసే పోరాటం మీద సినిమా ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. 


Also Read: cమహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కే కిక్కు - ఆ ఎనర్జీ ఏంటి బాసూ?