Finally Got Clarity About Megha Akash Marriage : నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త.. లై బ్యూటీ మేఘ ఆకాశ్ పెళ్లి. ఆమె చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటోంది అంటూ నెట్టింట వైరల్ అయ్యింది. కారణం ఆమె ఒక ఫొటో పోస్ట్ చేయడం. చక్కగా చీర కట్టుకుని, చేతికి గోరింటాకు పెట్టుకుని ఆమె ఫొటోలను షేర్ చేయడం, దానికి మ్యారేజ్ వైబ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించడంతో.. అందరూ ఆమె పెళ్లి అనుకున్నారు. ఆమె పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె మరోసారి పెళ్లి ఫొటోలు షేర్ చేశారు అయితే, అవి ఆమె పెళ్లి కాదు.
కజిన్ పెళ్లి?
మేఘ ఆకాశ్ షేర్ చేసిన పెళ్లి ఫొటోలతో పెళ్లి ఆమెది కాదని, ఆమె కజిన్ ది అనే క్లారిటీ వచ్చింది. వెడ్డింగ్ వీక్ డంప్ అంటూ పెళ్లిలో దిగిన గ్రూప్ ఫొటోలు, ఆమె ఫొటోలు పోస్ట్ చేసింది. మై లవ్ శ్వేత కళాధరన్ స్టన్నింగ్ బ్రైడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేఘ. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని విష్ చేశారు. ఆ ఫొటోల్లో మేఘ క్యూట్ గా కనిపించారు.
అసలు రూమర్ ఎందుకు వచ్చిందంటే?
సెలబ్రిటీలు ఏదైనా ఫొటో పెట్టినా, పోస్ట్ పెట్టినా దాన్ని తెగ విశ్లేషిస్తారు అభిమానులు. అలా మేఘ ఒక పోస్ట్ పెడితే.. దాన్ని తెగ ఊహించేసుకున్నారు. చేతి నిండుగా మెహందీ పెట్టుకుని, పట్టుచీర కట్టుకుని రెడీ అయ్యింది మేఘ. దీంతో ఆమె పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. ఇక మేఘ కూడా జస్ట్ ఒక హ్యాష్ ట్యాగ్ మాత్రమే పెట్టింది. ఎవరి పెళ్లో చెప్పకపోవడంతో రూమర్స్ ఊపందుకున్నాయి. మొత్తానికి లేటెస్ట్ పిక్స్‌తో ఒక క్లారిటీ ఇచ్చేసింది మేఘ.
సినిమాల్లో బిజీ బిజీగా..
ఇక ప్రస్తుతం మేఘ సినిమాల్లో బిజి బిజీగా గడుపుతున్నారు. రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు ఆమె. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రాజశ్రీ నాయర్, 'శుభలేఖ' సుధాకర్ తదితర సీనియర్ నటులతో కలిసి 'సఃకుటుంబానాం' అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో రామ్ కిరణ్ హీరోగా చేస్తుండగా.. ఉదయ్ శర్మ దర్శకుడు. హెచ్.ఎన్.జి సినిమాస్ పతాకంపై మహాదేవ గౌడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక దీంతో పాటు ఆమె నటించిన వికట కవి అనే వెబ్ సిరీస్ జీ 5లో రానుంది. అయితే, దానికి సంబంధించి రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఇక వికటకవి తెలంగాణ బేస్డ్ గా వస్తున్న మొదటి వెబ్ సిరిస్. ఆమె చేస్తున్న సినిమా, వెబ్ సిరీస్ లకి సంబంధించి పోస్టర్ లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
'లై' సినిమాతో తెలుగులో ఎంట్రీ..
మేఘ 'లై' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆమె పెద్దగా సక్సెస్ అవ్వలేదు. రావణాసుర లో ఆమె నెగటివ్ క్యారెక్టర్ చేసినప్పటికీ అది కూడా ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. 'ఛల్ మోహన రంగ', 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేశారు.
Also Read: 200కి వస్తావా అంటే.. ఎందుకో తెలియక సరే అనేదాన్ని - ఎక్కడెక్కడో టచ్ చేసేవారు: నటి కీర్తి భట్