మెగా బ్రదర్స్ అందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ కు చూడడానికి రెండు కళ్లు సరిపోవు. మదర్స్ డే సందర్భంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు తల్లి అంజనా దేవీతో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించరు. అమ్మలందరికీ మదర్స్ డే విషెస్ చెబుతూ.. తల్లి అంజనా దేవితో గడిపిన క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్. ఈ వీడియో అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. 


మెగాబ్రదర్స్ ముగ్గురూ షూటింగ్ స్పాట్ లో ఉండగా.. తల్లి అంజనా దేవి అక్కడకు వెళ్లారు. తన పిల్లలతో కలిసి భోజనం చేశారు అంజనా దేవి. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం అంజనా దేవిని దగ్గరుండి కారెక్కించి ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా నలుగురు కలిసి దిగిన కొన్ని ఫొటోలను వీడియోకి యాడ్ చేశారు. ఈరోజు మదర్స్ డే కావడంతో తల్లితో గడిపిన మధుర క్షణాలను ఇలా వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు చిరు. 


ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ మెగాస్టార్ ను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటికి పెద్ద కొడుకంటే మీలా ఉందంటూ చిరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్', 'వాల్తేర్ వీరయ్య' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. 


Also Read: కాజల్ అగర్వాల్ కుమారుడిని చూశారా? ఫస్ట్ ఫొటో బయటకు వచ్చేసింది!


Also Read: 'ది వారియర్' టీజర్‌తో రానున్న రామ్, ఊర మాస్ విజువల్స్ చూడటానికి రెడీనా?