Megastar Chiranjeevi: నన్ను డామినేట్ చేస్తే ఊరుకోను - తాప్సీపై చిరు కామెంట్స్ 

'మిషన్ ఇంపాజిబుల్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Continues below advertisement

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో స్వరూప్ ఆర్.ఎస్.జె తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి తాప్సీ ప‌న్ను అంగీకరించిన సంగతి తెలిసిందే. అదే 'మిషన్ ఇంపాజిబుల్'. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ 1 న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

Continues below advertisement

తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముందుగా సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు చిరు. తను సినిమా చూశానని.. ఫస్ట్ హాఫ్ మంచి కామెడీతో ఉంటుందని.. సెకండ్ హాఫ్ కథ మరింత ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందని అన్నారు. తనను నమ్మి ఆడియన్స్ సినిమాకి వెళ్లొచ్చని చెప్పుకొచ్చారు. 

ఇక సినిమా మెయిన్ లీడ్ పోషించిన తాప్సీని పొగడ్తలతో ముంచెత్తారు చిరు. 'ఝుమ్మంది నాదం' సినిమా సమయంలో గ్లామర్ డాల్ గా ఉన్న అమ్మాయి.. బాలీవుడ్ కి వెళ్లి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తూ తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుందని అన్నారు. హిందీలో బిజీ అవ్వడం వలన ఆమె తెలుగు సినిమాలు చేయలేకపోతోందని.. కానీ తన సినిమాలో కచ్చితంగా నటించాలని అడిగారు. అయితే 'బద్లా' సినిమాలో తన నటనతో అమితాబ్ బచ్చన్ ని డామినేట్ చేసినట్లు తనను డామినేట్ చేస్తే ఊరుకోనని ఫన్నీగా చెప్పారు చిరు. 

Also Read: ఎన్టీఆర్ 8 కిలోల టార్గెట్, కొత్త లుక్ కోసం స్పెషల్ వర్కవుట్

Continues below advertisement
Sponsored Links by Taboola