Chiranjeevi About Varun Tej & Lavanya Tripathi Love Story: మెగా హీరో వ‌రుణ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ఇద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీలీలో వీరిద్ద‌రి పెళ్లి చాలా ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబ‌స‌భ్యులు, కొద్దిమంది స‌న్నిహితుల మ‌ధ్య ఈ పెళ్లి జ‌రిగింది. అయితే వ‌రుణ్, లావ‌ణ్య త్రిపాఠి చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ విష‌యాన్ని ఎక్క‌డా లీక్ కాకుండా చాలా జాగ్ర‌త్త ప‌డ్డారు ఈ ఇద్ద‌రు. క‌నీసం చిరంజీవికి కూడా చెప్ప‌లేద‌ట ఈ జంట‌. ఆ విష‌యంపై స్పందించారు చిరంజీవి. 'ఆప‌రేష‌న్ వాలంటైన్స్' సినిమా ప్రీ రిలీజ్ కి వ‌చ్చిన ఆయ‌న లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్ ల‌వ్ స్టోరీపై జోకులు పేల్చారు.  


కోపంగా ఉంది... 


వ‌రుణ్ తేజ్ న‌టించిన 'ఆప‌రేష‌న్ వాలంటైన్' సినిమా మార్చి 1న రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి స్పెష‌ల్ గెస్ట్ గా వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి సుమ యాంక‌రింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా సుమ చిరంజీవిని కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు దాంట్లో భాగంగా.. "చిరు లీక్స్ అంటే మాకు చాలా ఇష్టం. చాలాసార్లు చిరు లీక్స్ ని ఎంజాయ్ చేశాం. అయితే, వ‌రుణ్ అండ్ లావ‌ణ్య ల‌వ్ స్టోరీని ఎందుకు లీక్  చేయ‌లేదు? మీకు కూడా వాళ్లు చెప్ప‌లేదా?" అన్న ప్ర‌శ్న‌కి చిరంజీవి స‌మాధానం చెప్తూ త‌న‌కు చెప్ప‌లేద‌ని చాలా కోపం వ‌చ్చింద‌ని అన్నారు.


"ప్ర‌తి విష‌యం నాతో చెప్తాడు. ఏ విష‌యం నా ద‌గ్గ‌ర దాచ‌డు. న‌న్ను చూసి స్ఫూర్తి పొందాను అంటాడు. కానీ, లీక్స్ విష‌యంలో మాత్రం న‌న్ను స్ఫూర్తిగా తీసుకోలేదు. నాకు త‌న ప్రేమ విష‌యం చెప్ప‌లేదు. వాళ్ల నాన్న‌కు కూడా చెప్ప‌లేని చాలా విష‌యాలు నాతో చెప్తాడు. అలాంటిది ఈ ఒక్క‌టి చెప్ప‌లేదు. అందుకే, నాకు ఇప్ప‌టికీ కోపంగానే ఉంది" అంటూ న‌వ్వుతూ స‌మాధానం చెప్పారు చిరు. వెంట‌నే దానికి స‌మాధానంగా "అది.. గౌర‌వంతో కూడిన భ‌యం. దాని వ‌ల్ల చెప్ప‌లేదు. ప్రేమ విష‌యం ఫ‌స్ట్ నేను చెప్పింది మా పెద్ద నాన్న‌కే" అని అన్నాడు వ‌రుణ్ తేజ్. 


పైలెట్‌గా వ‌రుణ్ తేజ్


వ‌రుణ్ తేజ్ పెళ్ల‌య్యాక  రిలీజ్ అవుతున్న మొద‌టి సినిమా ‘ఆప‌రేష‌న్ వాలంటైన్’. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ పైలెట్ గా క‌నిపించ‌నున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కించారు. ఫిబ్రవరి 14న ఈ సంఘ‌ట‌న జ‌రిగిన నేప‌థ్యంలోనే సినిమాకి  'వాలెంటైన్‌' అని పేరు పెట్టిన‌ట్లు చిత్ర బృందం గ‌తంలో ప్ర‌క‌టించింది. ఇక ఈ సినిమాని బాలీవుడ్‌ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్‌ తెరకెక్కించాడు. ఈ చిత్రం వరుణ్‌ తేజ్‌ సరసన మాజీ మిస్‌ ఇండియా మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటించింది. న‌వ‌దీప్ త‌దిత‌రులు ప్ర‌ధాన ప్రాత‌లు పోషించారు. ఈ సినిమాతోనే వ‌రుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్నోరోజులుగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్సెస్‌కు ఈ సినిమా ఊర‌ట క‌లిగిస్తుందో లేదో చూడాలి మ‌రి.  


Also Read: నా కళ్ల ముందే చనిపోయాడు - బ్రేక‌ప్ స్టోరీ చెప్పి క‌న్నీళ్లు పెట్టుకున్న దివి - అస‌లు ఏం జ‌రిగిందంటే?