మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 154వ చిత్రమిది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి మెగా154 (Mega154)గా అనేది వర్కింగ్ టైటిల్. నవంబర్ 6... అనగా ఈ శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం కానుంది. "దీపావళితో సంబరాలకు ఎండ్ కార్డు పడటం లేదు. మెగా ఫెస్టివల్ ముందుంది. నవంబర్ 6న మరిన్ని పూనకాలు లోడ్ అవుతాయి" అని మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది.
నవంబర్ 6న ఉదయం 11.43 గంటలకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 12.06 గంటలకు మెగాస్టార్ మాస్ మూలవిరాట్ దర్శనం అని దర్శకుడు కె.ఎస్. రవీంద్ర తెలిపారు. విశాఖ సముద్ర తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వాల్తేరు వీరయ్యగా చిరంజీవి కనిపిస్తారని, సినిమాలో ఆయన పేరే టైటిల్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. సినిమా ప్రారంభం రోజున టైటిల్ ప్రకటిస్తారేమో చూడాలి. చిరంజీవికి కె.ఎస్. రవీంద్ర వీరాభిమాని. అభిమానులు కోరుకునే విధంగా కథ రెడీ చేశారని, తెరపై మాస్ అవతారంలో మెగాస్టార్‌ను చూపిస్తారని టాక్.
Also Read: ప్రభాస్ రీసెంట్ కెరీర్‌లో ఇదొక రికార్డ్... అంత తక్కువ రోజుల్లోనా!?
మెగా154 కంటే ముందు మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' (మలయాళ హిట్ 'లూసిఫర్' రీమేక్)ను చిరంజీవి కంప్లీట్ చేయనున్నారు. త్వరలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ 'వేదాళం' రీమేక్ 'భోళా శంకర్' షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి